Operation Sindoor - Viral Video : ఆపరేషన్ సిందూర్‌కు అసలైన నివాళి.. సంచలనం సృష్టిస్తున్న వీడియో సాంగ్... హైలెట్‌గా నిలిచిన మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌ .. కాళీ మాతను చూస్తే గూస్‌బంప్స్...

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-22 12:16:55  IST  )

‘ఆపరేషన్ సిందూర్’.. పాక్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద కదలికలను లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నిర్వహించిన స్ట్రైక్. 26 మంది భారతీయ పర్యాటకులను చంపిన పహెల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా చేసిన ఈ ఆపరేషన్‌ను..

Operation Sindoor - Viral Video : ఆపరేషన్ సిందూర్‌కు అసలైన నివాళి.. సంచలనం సృష్టిస్తున్న వీడియో సాంగ్... హైలెట్‌గా నిలిచిన మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌ .. కాళీ మాతను చూస్తే గూస్‌బంప్స్...
X

దిశ, ఫీచర్స్ : ‘ఆపరేషన్ సిందూర్’.. పాక్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద కదలికలను లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నిర్వహించిన స్ట్రైక్. 26 మంది భారతీయ పర్యాటకులను చంపిన పహెల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా చేసిన ఈ ఆపరేషన్‌ను.. భారతీయ పౌరులు పూర్తిగా సమర్థించారు. భవిష్యత్‌లో దాడులకు పాల్పడకుండా పాక్‌కు మరింత బుద్ధి చెప్పాలని కోరారు. ఇంకోసారి ఎటాక్‌కు ప్రయత్నించాలనే ఆలోచన రాకుండా చేయాలన్నారు. తమకు చాన్స్ వస్తే పాక్‌పై యుద్ధం చేసేందుకు తాము సిద్ధమని దేశభక్తిని చాటుకున్నారు.

ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్‌కు వీడియో ట్రిబ్యూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్వెంటీ ఒన్ పైలట్స్ యొక్క ‘హీథెన్స్’ పాటను ఇందుకు ఉపయోగించిన క్రియేటర్స్ .. న్యాయం, జాతి గర్వం ప్రతిబింబించేలా ఎడిట్ చేశారు. ఉగ్రవాదానికి బలమైన సైనిక ప్రతిస్పందనలను భారతీయులు సమర్థిస్తున్నారు అనే ప్రజా భావనను ఈ క్లిపింగ్‌ ద్వారా చూపగా.. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. లక్షల వీక్షణలు, లైక్స్ పొందిన ఈ క్లిపింగ్.. బెస్ట్ ఇంప్రెషన్‌తో దూసుకుపోతుంది. మొత్తానికి @curioustiz ఎడిట్ చేసిన వీడియో సూపర్ డూపర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించింది. భర్తను కోల్పోయిన భారత స్త్రీలతో మొదలైన వీడియో చివరకు జస్టిస్ సర్వ్‌డ్ అంటూ ఎండ్ అయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్, బ్రేవ్ సోల్జర్స్, ఆర్మీ ఆఫీసర్స్, విక్టిమ్స్, కాళీమాతకు పూజలు, ఉగ్రవాద స్థావరాలపై దాడులు ఈ క్లిపింగ్‌లో భాగం కాగా ఇండియా పాక్‌పై రివేంజ్ ఎలా తీర్చుకుందో చాలా చక్కగా కన్వే చేసింది.

Next Story