Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. పాక్ షేర్ మార్కెట్లు ఢమాల్

by Muthe.Rajitha |

హల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. పాక్ షేర్ మార్కెట్లు ఢమాల్
X

దిశ,వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. అనేక పరిణామాల అనంతరం భారత ఆర్మీ "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor) పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. ముష్కరులను అంతమొందించింది. భారత భద్రతా బలగాలు జరిపిన ఈ దాడుల కారణంగా పాక్ షేర్ మార్కెట్లు కుప్పకూలి(Pak Share Markets Down) పోయాయి. ఆర్మీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కి పాక్ స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్ కనిపించింది. పాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ-100 ఆరంభంలోనే 5.5 శాతం నష్టంతో 6,272 పాయింట్లు కోల్పోయి 1,07,296 పాయింట్లకు చేరింది.

అయితే పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఏ క్షణాన అయినా దాడి జరగవచ్చుననే భయంతో పాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సూచీ ఇప్పటికే 3.7 శాతం నష్టపోగా.. నేడు మరోసారి భారీ నష్టాన్ని చవిచూసింది. అయితే ఇండియన్ ఆర్మీ జరిపిన ఈ ఉగ్రదాడి ఎఫెక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ పై ఏ మాత్రం ప్రభావం చూపక పోవడం గమనార్హం. డాలరు బలహీన పడటం, అమెరికా,చైనాలో వృద్ధి తగ్గడం, క్రూడాయిల్ రేట్లు తగ్గుముఖం వంటి అంశాలు ఇన్వెస్టర్లు పాక్ పై దాడిని మరిచిపోయేలా చేశాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Next Story