Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్ కు భారీ నష్టం

by Shamantha N |

ఆపరేషన్ సిందూర్ వల్ల తమకు నష్టం జరిగిందని పాక్ మరోసారి పేర్కొంది. నష్టాలకు సంబంధించిన వివరాలను మెల్లమెల్లగా వెల్లడిస్తోంది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్ కు భారీ నష్టం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ వల్ల తమకు నష్టం జరిగిందని పాక్ మరోసారి పేర్కొంది. నష్టాలకు సంబంధించిన వివరాలను మెల్లమెల్లగా వెల్లడిస్తోంది. అయితే, ఆపరేషన్ సిందూర్ లో 11 మంది సైనికులు చనిపోగా.. మరో 78 మంది గాయపడినట్లు పాక్ పేర్కొంది. ఇక పాకిస్థాన్‌ వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది మృతి చెందారని.. మిగతావారు ఆర్మీ సిబ్బంది అని తెలిపారు. చనిపోయిన వారిలో స్క్వాడ్రన్‌ లీడర్‌ ఉస్మాన్‌ యూసఫ్‌ కూడా ఉన్నట్లు తెలిపింది. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌లో 40 మంది పౌరులు చనిపోగా.. 121 మంది గాయపడినట్లు పేర్కొంది. ఈమేరకు ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్‌పీఆర్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. పాకిస్థాన్ సాయుధ దళాలు ఆపరేషన్ బన్యన్ మార్సూస్ ద్వారా కచ్చితమైన, పదునైన ప్రతీకార దాడులను నిర్వహించాయంది. పాకిస్థాన్ సాయుధ దళాలు, ప్రజలతో కలిసి మరణించిన పౌరులు, సైనిక సిబ్బందికి నివాళులు అర్పిస్తాయంది. " ఇందులో ఎలాంటి అస్పష్టత ఉండకూడదు: పాకిస్థాన్ సార్వభౌమత్వాన్ని లేదా ప్రాదేశిక సమగ్రతను సవాలు చేసే ఏ ప్రయత్నానైనా వేగవంతమైన, పూర్తి స్థాయి, నిర్ణయాత్మక ప్రతిస్పందనతో ఎదుర్కోవాలి" అని పేర్కొంది.

పాక్ ఆర్మీ చీఫ్..

మరోవైపు, పాక్‌ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరీ.. తమ దేశ ఎయిర్‌ఫోర్స్‌, నేవీ అధికారులతో కలిసి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘‘భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణల్లో మన వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం స్వల్పంగా ధ్వంసమైంది’’ అని వెల్లడించారు. అయితే, ఆ నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలను ఆయన బయటపెట్టలేదు. మరోవైపు, భారత వాయుయసేనకు చెందిన ఎయిర్ మార్షల్ ఏకే భారతి కూడా తాము పాక్ యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ధ్రువీకరించారు. ఆ శకలాలు పాక్ లి పడిపోయినట్లు పేర్కొన్నారు. కూలిన విమానం పాక్ కు చెందిన మిరాజ్ కావచ్చని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Next Story