Operation Sindoor: సా.5 తర్వాత అక్కడ దాడులు జరిగే చాన్స్.. భారత సైన్యం అలర్ట్

by Prasad Jukanti |   (  Updated:2025-05-09 10:38:42  IST  )

ఇండో-పాక్ ఉద్రిక్తతల నడుమ భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది.

Operation Sindoor: సా.5 తర్వాత అక్కడ దాడులు జరిగే చాన్స్.. భారత సైన్యం అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్ తో యుద్ధవాతావరణం వేళ దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్థాన్, గుజరాత్, జమ్ముకశ్మీర్ వంటి కీలక ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ (Indian Army) అలర్ట్ ప్రకటించింది. నిన్నటి మాదిరిగా ఇవాళ కూడా పాక్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రాజస్థాన్ లో హై అలర్ట్ ప్రకటించి జైసల్మేర్, రామ్ ఘడ్, బడ్ మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్ లో బ్లాకౌట్ విధించింది. సాయంత్రం 5 గంటల నుంచి ఇళ్లలోనే ఉండాలని భారత్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో సైరన్ మోగించి పౌరులను భద్రతా ధళాలు అప్రమత్తం చేస్తున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం విషయంలో విమానయాన శాఖ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ విమానాశ్రయం తెరిచే ఉందని పేర్కొంది. కొన్ని సర్వీసులు మాత్రమే రద్దయినట్లు వెల్లడించింది. 9 అంతర్జాతీయ సర్వీసులు, 129 దేశీయ సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపింది. ప్రయాణికులకు విమానయాన శాఖ అడ్వైజరీ ఎయిర్ పోర్టులకు 3 గంటల ముందుగానే చేరుకోవాలని సూచన. 75 నిమిషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ చేసుకోవాలని సూచించింది.

Next Story