- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ బ్రీఫింగ్.. కోహ్లీ ప్రస్తావన తెచ్చిన ఆర్మీ
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పై సోమవారం భారత రక్షణ శాఖ(Indian Defence) అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పై సోమవారం భారత రక్షణ శాఖ(Indian Defence) అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత ఆర్మీ (Indian Army) పోరాటం ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారిపైనే అని మరోసారి స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా మే 7వ తేదీన ఇండియన్ ఆర్మీ జరిపిన దాడుల్లో ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఎక్కడా సాధారణ పౌరులను టార్గెట్ చేయలేదని వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్(Rajeev Ghai) ఓ ఆసక్తికర సంభాషణ చేశారు. టీంఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్ట్ క్రికెట్ నేడు గుడ్ బై ప్రకటించగా.. ఇదే విషయాన్ని మీడియా రాజీవ్ దగ్గర ప్రస్తావించింది.
ఎంతోమంది అభిమనుల్లా తనకు కూడా కోహ్లీ అంటే చాలా ఇష్టం అన్నారు. తాను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ లో ఆసీస్ బౌలర్స్ జెఫ్ థామ్సన్, డెనిస్ లిల్లీ బౌలింగ్ లో విధ్వంసం సృష్టించారని.. ఇంగ్లాండ్ బ్యాటర్లను ఊచకోత కోశారని తెలిపారు. అప్పుడు ఆస్ట్రేలియా 'యాషెస్ టు యాషెస్' అనే ఊత పదాన్ని వినియోగిస్తూ.. థామ్సన్ కాకపోతే లిల్లీ చేతిలో బలవ్వాల్సిందే అని పేర్కొనేవారని తెలియజేశారు. అదే విధంగా మన ఇండియన్ ఆర్మీ కూడా పవర్ ఫుల్ అని.. ఒక లేయర్ దాటి వస్తే ఇంకో లేయర్ వద్ద దొరికిపోవడం ఖాయం అని.. అందుకే పాక్ డ్రోన్లను, విమానాలను, మిసైల్స్ ను ఎక్కడిక్కడ అడ్డుకున్నామని వెల్లడించారు.






