- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: చైనా మిస్సైళ్లతో పాక్ దాడి చేసింది.. వారి ఏయిర్ బేస్ ను దెబ్బతీశాం:ఇండియన్ ఆర్మీ
ఆపరేషన్ సిందూర్ వివరాలను భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత ఆర్మీ (Indian Army) పోరాటం ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారిపైనే అని భారత రక్షణ శాఖ అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ లో (Operation Sindoor) భాగంగా మే 7వ తేదీన ఇండియన్ ఆర్మీ జరిపిన దాడుల్లో ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఎక్కడా సాధారణ పౌరులను టార్గెట్ చేయలేదని వెల్లడించారు. ఇవాళ ఆపరేషన్ సిందూర్ పై డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఎ.కె భారతి, వైస్ అర్మిరల్ ఎ.ఎన్ ప్రమోద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిందని కశ్మీర్, పీవోకేలో ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామన్నారు. చైనా తయారు చేసిన పీఎల్-15 మిస్సైళ్లతో పాకిస్తాన్ భారత్ పై దాడి చేసింది.అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థతో పాక్ క్షిపణులను, డ్రోన్లను తిప్పికొట్టాం. మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశాం. ఉగ్రవాదులకు పాక్ మిలటరీ మద్దతుగా ఉండడం సిగ్గుచేటు. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టామన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ (Pakistan) పై దాడుల వీడియోలను అధికారులు మీడియా సమావేశంలో ప్రదర్శించారు. సైన్యానికి అండగా నిలిచిన 140 కోట్ల మంది ప్రజలకు ఈ సందర్బంగా అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సైన్యం సర్వన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
రెండు ఎయిర్ బేస్ ధ్వంసం:
భారత్ జరిపిన వైమానిక దాడుల్లో నూర్ ఖాన్, రహిమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ లు ధ్వంసం అయినట్లు అధికారులు వెల్లడించారు. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మనం పాకిస్తాన్ ను అడ్డుకున్నాం. ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువులను దీటుగా ఎదుర్కొన్నాట్లు చెప్పారు. పపెహ్గంలో అమాయక ప్రజలపై పాక్ దాడులను తెగబడింది. మేం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ముందే సిద్ధం చేశాం. మన ఎయిర్ డిఫెన్స్ బలమైన గోడలా నిలిచింది. అత్యాధునిక ఆయుధాలతో పాక్ పై విరుచుకుపడినట్లు చెప్పారు.
త్రివిధ దళాల మధ్య సంపూర్ణ సమన్వయం..
బహుళ రక్షణ వ్యవస్థను అధిగమించే శక్తి పాక్ కు లేదని పహెల్గాం పాపానికి మూల్యం చెల్లించినట్లు తెలిపారు. మనకు అత్యాధునిక రాడార్లతో నిఘా వ్యవస్థ ఉంది. ఎగిరేవేంటే నిశితంగా గుర్తించే సామర్థ్యం వీటికుంది. భారత సైనిక స్థావరాలపై దాడి చేయడం అసాధ్యం. రాత్రి, పగలు పని చేయగల సామర్థ్యం మన పైలెట్లకు ఉన్నట్లు అధికారులు వివరించారు. త్రివిధ దళాల మధ్య సంపూర్ణ సమన్వయం ఉందని నౌకాదళం పరంగా కూడా పూర్తి సన్నద్ధత ఉందని తెలిపారు. ఫైటర్లు, నిఘా విమానాలు కాపలా కాస్తున్నాయి. బీఎస్ఎఫ్ జవాన్లు వారి బాధ్యతను నిర్వహించినట్లు వివరించారు. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకొని పాకిస్తాన్ మన వైమానిక స్థావరాలను ధ్వంసం చేయలేకపోయిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ లో నౌకాదళం కూడా విశిష్టమైన సేవలు అందించింది. ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్లు, రాడర్లు, డ్రోన్లు, హైస్పీడ్ మిసైల్స్, హెలికాప్టర్లు, వినియోగించినట్లు తెలిపారు. నౌకాదళ అడ్వాన్స్ రాడర్ల ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించగలిగామన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రుసేనల విమానాలను దగ్గరకు రాకుండా అడ్డుకోగలిగామన్నారు.






