- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
79వ స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రత్యేక ఆకర్షణగా ‘ఆపరేషన్ సింధూర్’
దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది.

దిశ,వెబ్‌డెస్క్: ప్రతీ ఏటా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను వైభవంగా జరుపుతారు. దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగా ప్రదేశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. అయితే, 1947 ఆగస్టు 15వ తేదీన జరిగిన చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటారు. భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులు, నాయకులును వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటారు. అయితే, ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఓ ప్రత్యేకత ఉంది.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఈ ఏడాది ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు మృతి చెందారు. మహిళలు తమ కళ్ల ముందే భర్తలను కోల్పోయారు. ఈ ఉగ్రదాడి యావత్ భారత దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది.
ఈ నేపథ్యంలో రేపు(ఆగస్టు 15) డిల్లీలోని ఎర్రకోట వద్ద జరిపే స్వాత్రంత్య్ర దినోత్సవాల్లో ‘ఆపరేషన్ సింధూర్’ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. జ్నానపర్‌లో భారీ స్థాయిలో ఆపరేషన్ సిందూర్ లోగో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ క్రమంలో అతిథులకు పంపే ఆహ్వాన కార్డుల పైనా ఆపరేషన్ సిందూర్ లోగో ముద్రించి పంపించారు. వేడుక అలంకరణ మొత్తంగా ఆపరేషన్ సింధూర్ గుర్తుగా ఉంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.






