ఇండియా పాక్ ఉధ్రిక్తతలు..బ్యాంకులకు నిర్మలమ్మ కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-09 16:39:40  IST  )

ఇండియా పాకిస్థాన్ మధ్య దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇండియా పాక్ ఉధ్రిక్తతలు..బ్యాంకులకు నిర్మలమ్మ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఆకస్మికంగా పాకిస్థాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు చేసింది. ఆ దాడులకు భారత ఆర్మీ సమర్ధవంతంగా ఎదుర్కొంది. అయితే యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని అన్ని బ్యాంకులు ఏదైనా సంఘటన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుకోని ఘటనలు జరిగి సంక్షోభం వచ్చినా ఎదుర్కుకునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రజలు మరియు వ్యాపారాలకు అంతరాయం లేకుండా ఆర్థికసేవలు అందించేలా జాగ్రత్త వహించాలని సూచించారు.

READ MORE ...

Finance Ministry: అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలర్ట్


Next Story