Pahalgam Terror Attack : పహల్గం దాడిపై NIA కీలక రిక్వెస్ట్

by Muthe.Rajitha |

NIA makes key request on Pahalgam attack

Pahalgam Terror Attack : పహల్గం దాడిపై NIA కీలక రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22 న జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో ఉగ్రవాదులు 28 మంది టూరిస్టులను దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(National Invistgation Agency-NIA) విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ ఘటనలో కీలక ఆధారాలు సేకరించిన NIA.. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నేషనల్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడి సమయంలో బైసరన్ వ్యాలీలో ఉన్న పర్యటకులు, స్థానికులు తీసిన ఫోటోలు, వీడియోలు లేదా ఇతర సంబంధిత సమాచారాన్ని తమకు అందించాలని NIA రిక్వెస్ట్ చేసింది.

ఈ సమాచారం దాడి యొక్క వివరాలను, దాడి చేసిన ఉగ్రవాదులను గుర్తించడానికి సహాయపడుతుందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పేర్కొంది. అలాంటి ముఖ్య సమాచారం ఎవరి వద్దనైనా ఉంటే 9654958846, 01124368800 నంబర్లకు పంపాలని విజ్ఞప్తి చేసింది. కాగా ఈ దాడికి రివేంజ్ గా భారత ఆర్మీ(Indian Army) 'ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) పేరుతో పాకిస్తాన్‌, POK లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్థరాత్రి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 100 మంది ముష్కరులు హతం అయ్యారు.

Next Story