- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
భారత ఆర్మీ చేతిలో హతమైన కీలక ఉగ్రవాదుల పేర్లు బహిర్గతం

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లలో మే 7న ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) లో భాగంగా భారత వైమానిక దాడులు చేసింది. మొత్తం 9 ప్రాంతాల్లో ఉగ్రవాదులు శిబిరాలపై ఈ దాడులు జరగ్గా 100 టెర్రరిస్టులు హతమయ్యారు. కాగా ఈ దాడుల్లో మరణించిన కీలక ఉగ్రవాదుల వివరాలు (Details of key terrorists) బహిర్గతం అయ్యాయి. ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్‌తొయిబా ఉగ్రవాదాలను భారత ఆర్మీ మట్టుబెట్టింది. కాగా ఇతర ఉగ్రవాదుల పేర్లు తెలియాల్సి ఉంది.
చంపబడిన ఉగ్రవాదుల వివరాలు
1 ముదస్సర్ ఖడియన్ ఖాస్ అలియాస్ ముదస్సర్ అలియాస్ అబూ జుందల్.. లష్కర్-ఎ-తొయిబా (LeT) చెందినవాడు. మురిద్కేలోని మర్కజ్ తాయిబా ఇన్‌ఛార్జ్ గా ఉన్నాడు.
2. హఫీజ్ ముహమ్మద్ జమీల్.. జైష్-ఎ-మొహమ్మద్ (JeM) చెందిన ఉగ్రవాది, మౌలానా మసూద్ అజార్ యొక్క పెద్ద అల్లుడు. బహవల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా ఇన్‌ఛార్జ్ గా ఉన్నాడు.
3. మహమ్మద్ యూసుఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ అలియాస్ మొహద్ సలీం అలియాస్ ఘోసీ సాహబ్ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) చెందిన ఉగ్రవాది. ఇతను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.
4. ఖలీద్ అలియాస్ అబూ అకాషా లష్కర్-ఎ-తొయిబా (LeT) చెందిన ఉగ్రవాది. జమ్మూ కాశ్మీర్‌లో జరిపినిన అనేక ఉగ్రవాద దాడులలో పాల్గొన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఆయుధాల స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరించాడు.
5. మొహమ్మద్ హసన్ ఖాన్ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాదిగా పేరుగాంచాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో JeM యొక్క ఆపరేషనల్ కమాండర్ అయిన ముఫ్తీ అస్ఘర్ ఖాన్ కాశ్మీరి కుమారుడు.