- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్ పై దౌత్య యుద్ధానికి ఎంపిక.. గౌరవంగా ఉందంటున్న ఎంపీ శశి థరూర్
పాకిస్తాన్‌పై దౌత్య యుద్ధంలో భాగంగా భారత ప్రభుత్వం ఏడు ఆల్-పార్టీ ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్‌పై దౌత్య యుద్ధంలో భాగంగా భారత ప్రభుత్వం ఏడు ఆల్-పార్టీ ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఒక బృందానికి నాయకత్వం వహించడానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Congress MP Shashi Tharoor) ఎంపికయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని బృందం అమెరికాకు వెళ్లనుంది. కాగా సందర్భంగా థరూర్ తనకు ఈ బాధ్యత ఇవ్వడంపై స్పందించారు. తనకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా (Against terrorism) పాక్ పై దౌత్య యుద్దానికి.. అవకాశం ఇవ్వడం గౌరవంగా ఉందని అన్నారు. "ఐదు కీలక రాజధానులకు ఆల్-పార్టీ బృందానికి నాయకత్వం వహించమని ప్రభుత్వం ఆహ్వానించడం గౌరవంగా ఉంది. జాతీయ ప్రయోజనాల కోసం నా సేవలు అవసరమైతే, నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. జై హింద్!" అని తన ట్వీట్ లో రాసుకొచ్చారు.
ఈ బృందాలు ఐక్య రాష్ట్ర సమితి భద్రతా మండలి (United Nations Security Council) సభ్య దేశాలతో సహా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, దక్షిణాఫ్రికా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కీలక దేశాలను సందర్శించి, ఏప్రిల్ 22, 2025న పహల్గామ్ ఉగ్రదాడి ప్రతిస్పందనగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను సమర్థించడం, పాకిస్థాన్ యొక్క ఉగ్రవాద మద్దతును బహిర్గతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో ఎంపీ శశి థరూర్‌తో పాటు, బీజేపీ ఎంపీలు రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సులే, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఇతర బృందాలకు నాయకత్వం వహిస్తారు.






