- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూ టార్గెట్‌గా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. ఎయిర్‌పోర్ట్ సహా ఏడుచోట్ల భారీ పేలుళ్లు
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) ప్రజలు మరోసారి హడలెత్తారు. గురువారం సాయంత్రం జమ్మూ నగరంలోని ఎయిర్‌పోర్ట్(Jammu Airport) సహా ఏడు ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు సంభవించాయి.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) ప్రజలు మరోసారి హడలెత్తారు. గురువారం సాయంత్రం జమ్మూ నగరంలోని ఎయిర్‌పోర్ట్(Jammu Airport) సహా ఏడు ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు సంభవించాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు నగరాన్ని బ్లాక్ అవుట్ చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు చేశారు. మరోవైపు పలుచోట్ల పాకిస్తాన్(Pakistan)కు చెందిన 8 మిస్సైల్‌ను భారత సైన్యం కూల్చివేసింది. మరోవైపు దేశ సరిహద్దుల్లో ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్‌కు చెందిన దాదాపు రూ.1600 కోట్ల విలువజేసే ఆస్తులను భారత బలగాలు ధ్వంసం చేశాయి. మధ్యాహ్నం పాకిస్తాన్‌లోని రావల్పిండి ఆర్మీ హెడ్‌క్వార్టర్(Pakistan Army Headquarters)పై, రావల్పిండి క్రికెట్ మైదానంపై డ్రోన్ దాడి చేశారు. ఈ దాడిలో చైనా నుంచి పాక్ తెచ్చుకున్న HQ9 క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.






