- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Loc: ఎల్వోసీ వద్ద పాక్ కాల్పులు.. దీటుగా బదులిస్తున్న భారత్
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పొరుగు దేశం పాకిస్థాన్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) తో పొరుగు దేశం పాకిస్థాన్ (Pakisthan) లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ దాడులకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, తంగ్ధర్ ప్రాంతాల్లో నియంత్రణ రేఖ (LOC) సమీపంలో ఉన్న గ్రామాల్లో కాల్పులకు తెగపడింది. ఈ ఘటనలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా, 43 మంది తీవ్రంగా గాయపడ్డారని సైన్యం తెలిపింది. అలాగే పాక్ దాడుల వల్ల పలు ఇండ్లు సైతం దెబ్బతిన్నాయని పేర్కొంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు ప్రారంభించిన కాసేపటికే పాక్ ఈ దాడులకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు.
అయితే సరిహద్దు కాల్పులకు సైన్యం వేగంగా స్పందించిందని, కుప్వారా రాజౌరి-పూంచ్ సెక్టార్లలోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై దాడి చేయగా గణనీయమైన నష్టం వాటిల్లిందని రక్షణ వర్గాలు తెలిపాయి. పాక్ దాడుల వల్ల స్థానిక నివాసితుల్లో భయాందోళననలు నెలకొన్నాయి. కొందరు బంకర్లలో ఆశ్రయం పొందగా మరికొందరు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్టు పలు కథనాలు వెల్లడించాయి. ఈ కాల్పులు పూంచ్ సెక్టార్ కు మాత్రమే పరిమితమయ్యాయని ప్రాణ నష్టం సైతం అక్కడే ఎక్కువగా సంబంధించిందని తెలిపాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో విద్యాసంస్థలను ప్రభుత్వం మూసివేసింది.






