భారత్, పాక్ యుద్ధం.. కేంద్రానికి మద్దతు ప్రకటించిన కర్ణాటక కాంగ్రెస్

by Vemula.Srinu Prasad |

భారత్, పాక్ యుద్ధంపై తీసుకునే చర్యలకు కేంద్రానికి మద్దతు కర్ణాటక కాంగ్రెస్ ప్రకటించింది...

భారత్, పాక్ యుద్ధం.. కేంద్రానికి మద్దతు ప్రకటించిన కర్ణాటక కాంగ్రెస్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్(Bharat), పాకిస్థాన్(Pakistan) మధ్య యుద్ధం వేళ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం(Karnataka Congress Government) కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ రోజు కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శివకుమార్(Deputy Cm Sivakumar) పాల్గొన్నారు.


భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తత పరిస్థితులపై ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యుద్ధంలో గెలిచే సత్తా ఇండియన్ ఆర్మీకి ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాలకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. నమ్మకం కూడా ఉంది. కేంద్ర తీసుకునే ఏ నిర్ణయం, చర్యలకు తాము కూడా మద్దతు ఇస్తున్నాం. దేశం సాధించబోయే విజయంలో తాము కూడా పాలుపంచుకుంటాం. సమైఖ్యంగా యుద్ధాన్ని ఎదుర్కొందాం. భారత జవాన్లకు మద్దతిస్తూ కర్ణాటకలో ఈ రోజు తిరంగా యాత్ర చేపట్టాం.’’ అని శివకుమార్ తెలిపారు.

Next Story