జస్ట్ 23 నిమిషాల్లో ఉగ్రవాదం అంతమైంది.. రాజ్‌నాథ్‌ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-16 07:48:13  IST  )

పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదన్ని అంతం చేసేందుకు భారత వైమానికి దళానికి జస్ట్ 23 నిమిషాలు సరిపోయాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జస్ట్ 23 నిమిషాల్లో ఉగ్రవాదం అంతమైంది.. రాజ్‌నాథ్‌ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత వైమానిక దళానికి జస్ట్ 23 నిమిషాలు సరిపోయాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్‌తో కలిసి భుజ్‌లోని ఎయిర్ బేస్‌కు వెళ్లారు. అనంతరం అక్కడున్న ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో ఆయన సరదాగా సంభాషించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. 1965లో పాకిస్తాన్‌పై మన విజయానికి భుజ్ సాక్షిగా నిలిచిందని.. ఇవాళ మరోసారి ఇదే ప్రాంతం నుంచి దాయాదిపై విక్టరీ సాధించామని కామెంట్ చేశారు. ‘ఆపరేషన్‌ సిందూర్’‌లో త్రివిధ దళాల పరాక్రమాన్ని చూసి యావత్ భారతదేశం గర్విస్తోందని.. ప్రపంచ దేశాలు మన సేనలను కొనియాడుతున్నాయని అన్నారు.

గురువారమే తాను శ్రీనగర్‌ సరిహద్దుల్లో సైనికులను కలిశానని.. ఇవాళ భుజ్‌లో వైమానిక యోధులను కలుస్తున్నానంటూ చమత్కరించారు. త్రివిధ దళాల్లో ఉత్సాహం, ఉత్తేజాన్ని చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. భారత సరిహద్దులు సురక్షితమే అన్న నమ్మకం తనతో పాటు యావత్ దేశానికి ఉందని పేర్కొన్నారు. బ్రహ్మోస్ క్షిపణి శక్తిని పాకిస్తాన్ కూడా ఒప్పుకుందని అన్నారు. ఆ మిస్సైల్ ధాటికి పాకిస్తాన్‌ చీకటిలో పగటి వెలుగు చూసిందంటూ సెటైర్లు వేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది శత్రు దేశం భూభాగంలోకి వెళ్లి క్షిపణులను ప్రయోగించిన సమయం.. భారత ప్రజలు ఉదయం భోజనం చేసే సమయంతో సమానమని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. పాకిస్తాన్‌కు మంజూరైన ఐఎంఎఫ్ డబ్బు ఉగ్రవాదులకు చేరుతుందని.. పరోక్షంగా ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తారా.. అంటూ నిధులపై ఐఎంఎఫ్ పునరాలోచించాలని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Next Story