- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : పెళ్లైన 3 రోజులకే ఆర్మీ నుంచి పిలుపు.. ఆ సైనికుడి భార్య ఏం చేసిదంటే..
Operation Sindoor : పెళ్లైన 3 రోజులకే ఆర్మీ నుంచి పిలుపు.. ఆ సైనికుడి భార్య ఏం చేసిదంటే..

దిశ, ఫీచర్స్ : భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వల్ల ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలవుల్లో ఉన్నవారంతా తిరిగి విధుల్లో చేరాలని ఇండియన్ ఆర్మీ అధికారుల నుంచి పిలుపు రావడంతో లీవుల్లో ఉన్న జవాన్లు తిరిగి వెళ్తున్నారు. బంధాలు, భావోద్వేగాలు, బాధలను సైతం పక్కన పెట్టి దేశంకోసం యుద్ధరంగంలో దిగుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ జవాన్ కూడా అదే చేశాడు. పెళ్లైన మూడు రోజులకే ఆర్మీ నుంచి ఎమర్జెన్సీ కాల్ రావడంతో తిరిగి వెళ్లాడు. కానీ.. ఈ సందర్భంగా ఆ జవాన్ భార్య చెప్పిన మాటలు విని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏం జరిగిందంటే..
మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్(Manoj Patil) ఇండియన్ ఆర్మీ(Indian Army)లో పనిచేస్తున్నాడు. కాగా తనకు పెళ్లి కుదరడంతో కొన్నిరోజుల కిందట స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఈనెల 5న అతని వివాహం జరిగింది. అయితే ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఇండియా పాక్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో అర్జంట్‌గా తిరిగి రావాలని మనోజ్ పాటిల్‌కు ఆర్మీ నుంచి ఫోన్ రావడంతో బార్డర్‌కు తరలివెళ్లాడు. అయితే ఫోన్ కాల్ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. కానీ మనోజ్ భార్య యామినీ మాత్రం పెళ్లయి మూడు రోజులే అయినప్పటికీ ‘దేశ రక్షణే మాకు ముఖ్యం. అందుకోసం నా సిందూరాన్ని బార్డర్‌కు పంపుతున్నా’ అంటూ భర్తను బార్డర్‌కు పంపింది. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






