కాల్పుల విరమణకు పాక్ తూట్లు..కుట్ర చేసింది అతనేనా ?

by velandi.Saikiran |

పాకిస్తాన్ ( Pakisthan) తన వక్ర బుద్ధిని మరోసారి బయట పెట్టింది. ఇవాళ సాయంత్రం జరిగిన కాల్పుల విరమణ ( ceasefire )

కాల్పుల విరమణకు పాక్ తూట్లు..కుట్ర చేసింది అతనేనా ?
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ ( Pakisthan) తన వక్ర బుద్ధిని మరోసారి బయట పెట్టింది. ఇవాళ సాయంత్రం జరిగిన కాల్పుల విరమణ ( ceasefire ) ఒప్పందాన్ని... మూడు గంటల్లోనే బ్రేక్ చేసింది పాకిస్తాన్. బ్రేక్ చేయడమే కాదు... జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) పరిసర ప్రాంతాల్లో డ్రోన్లను ( Drons) కూడా ఎగరవేసింది. అయితే ఆ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ ( Indian Army) చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

వాస్తవానికి.. కాల్పుల విరమణ జరిగిన తర్వాత ఎవరు కూడా దాడులు చేసుకోకూడదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఎదురుదాడి చేసింది. దీని వెనుక.. పెద్ద కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ( PM Shehbaz Sharif ) అలాగే ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ( Army Chief Asim Munir ) మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ ప్రధాని పట్టించుకోకుండా చేసి.. ఇండియా పై దాడి చేసినప్పుడు తెలుస్తోంది.

ఇండియాతో కాల్పుల విరమణ ఒప్పందం ఆర్మీ చీఫ్ మునీర్ కు అస్సలు ఇష్టం లేదట. అందుకే పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఇండియా పైకి డ్రోన్లను వదిలినట్లు సమాచారం. అంటే పాకిస్తాన్ దేశంలో అంతర్యుద్ధం మొదలైందని చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఇండియా పైకి వచ్చిన డ్రోన్లను.. క్షణంలోనే భూస్థాపితం చేసింది ఇండియన్ ఆర్మీ. ప్రస్తుతం సరిహద్దుల్లో కాల్పులు జరగడంలేదని అధికారికంగా ప్రకటించింది ఇండియన్ ఆర్మీ.

Next Story