- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: వాళ్లపై దాడి చేయాల్సింది కాదు : సీఎం ఒమర్ అబ్దుల్లా
భారత్ దాడుల అనంతరం నియంత్రణ రేఖ వెంట పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శ్రీనగర్లో అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు వర్గాలు తెలిపాయి.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారంగా.. పాక్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత త్రివిధ దళాలు గత అర్థరాత్రి మిస్సైళ్లతో దాడి చేసి.. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. 9 ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ (PAK Army) .. నియంత్రణ రేఖ (LoC) వద్ద మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ ఆర్మీ కాల్పుల్లో అమాయకులైన పౌరులు మరణించారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah) స్పందించారు. పాక్ మిలిటరీ, పాక్ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉగ్ర శిబిరాలపై దాడులు చేశామని, పాక్ మాత్రం అన్యాయంగా జమ్మూకశ్మీర్ పౌరులపై దాడిచేసి 10 మందిని పొట్టనపెట్టుకుందని జమ్మూకశ్మీర్ సీఎం విమర్శించారు. ఇక ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత సైన్యం ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
భారత్ దాడుల అనంతరం నియంత్రణ రేఖ వెంట పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శ్రీనగర్లో అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్, ఎల్ఓసీ ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు సీఎం అన్ని క్యాబినెట్ సహచరులతో సమావేశమవుతారని తెలుస్తోంది.
మరోవైపు భారత్ చేసిన పని సరైనదేనని ప్రపంచ దేశాలు సపోర్ట్ గా నిలుస్తున్నాయి. ఇంటర్నేషనల్ మీడియా సైతం ఈ దాడులపై వరుసగా కథానాలు టెలీకాస్ట్ చేస్తోంది. ఉగ్రదాడి జరిగిన 2 వారాల తర్వాత పాక్ పై భారత్ దాడి చేసిందని న్యూయార్క్ టైమ్స్, పాక్, పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ దాడులు అంటూ బీబీసీలో కథనాలు వచ్చాయి.






