- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL: గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచి ఐపీఎల్ రీ స్టార్ట్?
ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతలతో ఆగిపోయిన ఐపీఎల్ 2025 సీన్ తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండో-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అర్థాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ -2025 సీజన్ రీ స్టార్ట్ కు కసరత్తు జరుగుతోంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో కొత్త షెడ్యూల్ పై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ మేరకు ఇవాళ ఐపీఎల్ పాలక మండలి కీలక భేటీ నిర్వహిచబోతున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ వారంతంలో టోర్నమెంట్ కొనసాగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15 తేదీ నుంచి మ్యాచ్ లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మునుపటి జోష్ కనిపించేనా?:
సీజన్ లో భాగంగా లీగ్ దశలో 12 మ్యాచ్ లు ఫ్లై ఆఫ్స్ లో 4 కలిపి మొత్తం 16 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఇండియా-పాక్ మధ్య యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టోర్నమెంట్ కు బ్రేక్ వేశారు. అయితే మే 15 నుంచి ఐపీఎల్ తిరిగి ప్రారంభం అయినా మునుపటి జోష్ కనిపిస్తుందా అనేది అనుమానాలు కలుగుతున్నాయి. తాజా పరిణామాలతో చాలా మంది విదేశీ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. లీగ్ రీస్టార్ట్ అయితే వాళ్లందరినీ వెనక్కి తీసుకురావడం ఫ్రాంచైజీలకు బిగ్ టాస్క్ గా మారనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25వ తేదీ లోపు అందుబాటులో ఉంటామని ఆ తర్వాత ఐపీఎల్ లో కనసాగలేం అంటూ ఫారిన్ ఆటగాళ్లు పరోక్షంగా ఫ్రాంచైజీలకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లను ఎక్కువగా నమ్ముకున్న జట్లు ఆందోళనలో పడినట్లు తెలుస్తోంది.






