- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indo-Pak war tension: భారత్ - పాక్ మధ్య వార్ టెన్షన్.. మొదలైన అక్రమార్కుల దోపిడి
భారత్ పాక్ మధ్య వార్ టెన్షన నేపథ్యంలో నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలపై అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండో పాక్ మధ్య వార్ (India Pak War) టెన్షన్ నడుస్తున్న వేళ కొంత మంది వ్యాపారులు తమ వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. నిత్యావసర వస్తువులను (Essential Commodities) అక్రమంగా నిల్వచేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో జనాలు నిత్యావసర వస్తువులు కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని చోట్ల ముందస్తుగా వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో చండీగఢ్ జిల్లా మెజిస్ట్రేక్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల వ్యాపారస్తులు, నిల్వదారులు తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలను మూడు రోజుల్లోగా ఆహార సరఫరాల శాఖకు వెల్లడించాలని ఆదేశించింది. బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు, చక్కెర, వంట నూనే, కూరగాయలు, పాలు, మెడిసిన్స్, పెట్రోల్, డీజిల్ వంటి వస్తువులను అక్రమంగా నిల్వ (Illegal Stockpiles) చేయకూడదని టోకు, రిటైలర్ వ్యాపారస్తులను ఆదేశించింది. ఈ ఉత్తర్వు జూలై 7 వరకు అమలులో ఉంటుందని పేర్కొంది.






