ఇండిగో కీలక ప్రకటన... అప్పటి వరకు విమానాలను రద్దు !

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.... ఇండిగో కీలక ప్రకటన చేసింది. తమ విమానాలను

ఇండిగో కీలక ప్రకటన... అప్పటి వరకు విమానాలను రద్దు !
X

దిశ, వెబ్ డెస్క్:ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.... ఇండిగో కీలక ప్రకటన చేసింది. తమ విమానాలను రద్దు చేసుకుంటున్నట్లువెల్లడించింది ఇండిగో. మే 13వ తేదీన అంటే మంగళవారం రోజున విమానాలు రద్దు చేస్తున్నట్లు.. వివరించింది. అయితే ఇండియా వ్యాప్తంగా కాకుండా కేవలం.. పాకిస్తాన్ - ఇండియా బార్డర్ కు దగ్గరగా ఉన్న విమానాశ్రయాల నుంచి విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

జమ్మూ, అమృత్ సర్, చండీఘర్, శ్రీనగర్, లేహ్, శ్రీనగర్ అలాగే రాజ్ కోట్ ప్రాంతాల నుంచి.. వెళ్లే విమానాలను రద్దు చేసుకుంది ఇండిగో కంపెనీ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ రూల్స్ ఇవాళ ఒక్కరోజు ఉంటాయా? మరిన్ని రోజులు పొడగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.


Next Story