- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీ స్టేడియాన్ని పేల్చేస్తామని వార్నింగ్!
పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... ప్రధాని నరేంద్ర మోడీ ( Modi ) స్టేడియాన్ని

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... ప్రధాని నరేంద్ర మోడీ ( Modi ) స్టేడియాన్ని పేల్చుతామని... బెదిరింపులు రావడానికి ఇప్పుడు కలకలం రేపుతోంది. బుధవారం వేకువ జామున ఆపరేషన్ సిందూర్ పేరుతో ( Operation Sindoor) పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టి కరిపించింది మోడీ ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు కథనాలు వస్తున్నాయి.
అయితే... పాకిస్తాన్ పై దాడి చేసిన ఇండియా ప్రభుత్వానికి ఆ దేశం నుంచి వార్నింగులు కూడా వస్తున్నాయి. స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ప్రతి రక్తపు బొట్టుకు... అధికారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ను వెయిట్ చేస్తామని ఓ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ పేరుతో ఓ వ్యక్తి గుజరాత్ క్రికెటర్ అసోసియేషన్కు మెయిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆ మెయిల్ రావడంతో వెంటనే గుజరాత్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ మెయిల్ ను చాలా సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ మెయిల్ పంపింది ఎవరు..? వాళ్ల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






