India-Pakistan war: 1971 తర్వాత కరాచీపై మళ్లీ భారత నేవీ దాడులు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-08 19:43:42  IST  )

ప్రస్తుతం భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో అన్ని భద్రతా దళాలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్చను ఇచ్చింది.

India-Pakistan war: 1971 తర్వాత కరాచీపై మళ్లీ భారత నేవీ దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో అన్ని భద్రతా దళాలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్చను ఇచ్చింది. దీంతో నౌకాదళం సైతం పాక్ పై విరుచుకుపడుతోంది. అరేబియా సముద్రంలో మోహరించిన భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్థాన్ ముఖ్య నౌకాస్థావరం అయిన కరాచీపై వరుస దాడులు చేస్తోంది.

కరాచీ నౌకాశ్రయంతో పాటూ నగరంపైనా దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే 1971లోనూ ఇండియా పాకిస్థాన్ యుద్ధంలో కరాచీ నౌకాస్థావరంపై భారత నౌకలు మెరుపు దాడులు చేసి పూర్తిగా నాశనం చేశాయి. 1971 డిసెంబర్ 4న మూడు యుద్ద నౌకలు నిఫాత్, నిర్ఘట్, వీర్ కరాచీకి వెళ్లాయి. వీటితో పాటూ పెట్యా తరగతికి చెందిన మరో రెండు యుద్ద నౌకలు కిల్టర్ మరియు కఛాల్ కూడా వెళ్లాయి. భారత నేవీ దాడులకు పాకిస్థాన్ యుద్ధనౌకల్లోని పాక్ సైనికులు నీళ్లలో దూకి పారిపోయారు. మళ్లీ 54 సంవత్సరాల తరవాత భారత్ కరాచీ నేవీ స్థావరాన్ని బూడిద చేస్తోంది.

Next Story