- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ డ్రోన్లు, మిస్సైల్స్ కూల్చివేతపై ఇండియన్ ఆర్మీ అధికారిక ట్వీట్
కశ్మీర్‌లో ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

దిశ, వెబ్ డెస్క్: కశ్మీర్‌లో ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ దాడి అనంతరం పాక్.. భారత్ పై ప్రతీకార చర్యగా ఆర్మీని రంగంలోకి దింపి.. గురువారం రాత్రి నుంచి డ్రోన్లు, మిస్సైల్స్, యుద్ధ విమానాలతో దాడులకు పాల్పడుతుంది. కాగా పాక్ దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొడుతూ.. ఎదురుదాడి చేసి పాక్‌ను మట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో పాక్‌తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు అయిన పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. ఈ దాడులను భారత ఆర్మీ తిప్పు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు జరిగి దాడులపై భారత ఆర్మీ అధికారిక ట్వీట్ చేసింది.
ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ (Indian Army) ట్వీట్‌లో "మన పశ్చిమ సరిహద్దుల్లో డ్రోన్ దాడులు, ఇతర మందుగుండు సామగ్రితో పాకిస్తాన్ (Pakistan) యొక్క స్పష్టమైన తీవ్రత కొనసాగుతోంది. అలాంటి ఒక సంఘటనలో, ఈరోజు ఉదయం సుమారు 5 గంటలకు, అమృత్‌సర్‌లోని ఖాసా కాంట్ మీదుగా ఎగురుతున్న బహుళ శత్రు సాయుధ డ్రోన్‌లు కనిపించాయి. శత్రు డ్రోన్‌లను మన వైమానిక రక్షణ విభాగాలు తక్షణమే నియోగించి నాశనం చేశాయి. భారతదేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడానికి, పౌరులను ప్రమాదంలో పడేయడానికి పాకిస్తాన్ చేసిన స్పష్టమైన ప్రయత్నం ఆమోదయోగ్యం కాదు. భారత ఆర్మీ (Indian Army) శత్రువు కుట్రలను అడ్డుకుంటుంది." అని రాసుకొచ్చింది. ట్వీట్‌కు పలు ఫోటోలను జత చేయగా అందులో.. పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ల శకలాలు కనిపించాయి.






