- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైషే శిబిరాన్ని నామరూపాల్లేకుండా చేశాం.. భారత సైన్యం అధికారిక ప్రకటన
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై భారత సైన్యం(Indian Army) కీలక ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై భారత సైన్యం(Indian Army) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆదివారం మరోసారి త్రివిధ దళాలు మీడియా ముందుకు వచ్చాయి. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఈనెల 8, 9వ తేదీల్లో రాత్రి 10:30 గంటల నుంచి భారత్‌లోని పలు నగరాలపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. పాక్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. పెహల్గాం దాడి తర్వాత ఇక ఊరుకోవద్దని.. బలమైన సమాధానం చెప్పాలనే నిర్ణయించాం. పీవోకేలోని ఉగ్రశిబిరాలను క్షుణ్ణంగా ఎంపిక చేసి టార్గెట్ చేశాం. రెండు ఉగ్రసంస్థల శిబిరాలను ధ్వంసం చేశాం. పౌరులు, సైనిక శిబిరాలను టార్గెట్ చేయలేదు. కేవలం ఉగ్రస్థావరాలనే ధ్వంసం చేశాం. ఈ దాడుల్లో జైషే శిబిరం నామరూపాల్లేకుండా పోయింది. పీవోకే పాటు పాకిస్తాన్‌లోని లాహోర్‌లోనూ దాడులు చేశాం. లాహోర్‌లో రాడార్‌లు ధ్వంసం చేశాం. తాము ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టాం. కానీ మధ్యలో పాకిస్తాన్ దూరింది. భారత్‌లోని నగరాలు, పౌరులే లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది. దీంతో తప్పక పాక్‌పైనా ఎటాక్ చేయాల్సి వచ్చింది. మొత్తం ఈ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాం. దాదాపు 100 మంది ఉగ్రవాదులను అంతం చేశాం. ఇందులో ముగ్గురు కీలక ఉగ్రవాదులు ఉన్నారు’ అని ఇండియన్ ఆర్మీ పేర్కొంది. పాక్‌పై చేసిన దాడుల్లో ఎయిర్‌డిఫెన్స్ బ్రహ్మాండంగా పనిచేసిందని అభినందించారు. ఇక నుంచి పాక్ జరిపే ప్రతీ దాడిని.. ఎదుర్కొంటాం, ఎదురుదాడి చేస్తామని సంచలన ప్రకటన చేశారు.






