- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Indian Army: భారత్‌పై పాక్ వరుస దాడులు.. ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
ఆపరేషన్ సిందూర్‌తో సతమతమైన పాకిస్థాన్, భారత్‌పై వరుస దాడులకు పాల్పడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్‌తో సతమతమైన పాకిస్థాన్, భారత్‌పై వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్‌కు చెందిన JF-17 యుద్ధ విమానాలను కూల్చివేసింది. అదేవిధంగా 12 అత్యాధునిక డ్రోన్లతోపాటు S400ను ప్రయోగించి గాల్లోనే బ్లాస్ట్ చేశారు. అయితే, JF-17 యుద్ధ విమానాలు కూలిపోయినట్లుగా పాక్ కూడా ధృవీకరించింది. అదేవిధంగా పోఖ్రాన్‌లో పాక్ మిస్సైల్‌ను కూడా పేల్చేశారు. ఈ క్రమంలోనే భారత్-పాక్ సరిహద్దు నగరాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించారు. జమ్ము, జైసల్మేర్, జలంధర్, అమృత్‌సర్ ప్రాంతాల్లో ప్రత్యర్థి పాక్ దాడికి పాల్పడకుండా.. పవర్ కట్ చేశారు.
ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని మరిన్ని డ్రోన్ దాడులు జరగొచ్చని హెచ్చరించారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌కు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు. పాక్ దాడులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే సమర్ధవంతంగా తిప్పికొడుతున్నామని.. ప్రజలెవరూ భయాందోళను గురికావొద్దని, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఎవరూ బయటకు రావొద్దని భారత ఆర్మీ వెల్లడించింది. అదేవిధంగా జమ్ముపై పాక్ దాడులను తిప్పికొట్టామని.. ఎక్కడా ఎలాంటి నష్టం జరగలేదని భారత రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు పాక్ సైనిక చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ నిశితంగా గమనిస్తున్నారు. దాడులపై ఎప్పటికప్పుడు సైనిక అధికారులతో ఆరా తీసున్నారు. ప్రస్తుతం ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్‌తో సమావేశంలో ఉన్నారు.






