Operation Sindoor : పాక్ పై భారత్ దాడి.. వీడియో విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ

by Muthe.Rajitha |   (  Updated:2025-05-12 10:05:35  IST  )

ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పై భారత త్రివిధ దళాలు(Indian Defence Force) సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించాయి.

Operation Sindoor : పాక్ పై భారత్ దాడి.. వీడియో విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పై భారత త్రివిధ దళాలు(Indian Defence Force) సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించాయి. అందులో భాగంగా.. ఈనెల 7న POK లో ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసి, ఉగ్రవాదుల స్థావరాలను నాశనం చేసినట్టు పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. POK లో చేపట్టిన ఆపరేషన్ విజయవనాథం అయిందని త్రివిధ దళాలు పేర్కొన్నాయి. పాక్ లో జరిగిన నష్టానికి ఆ దేశపు సైన్యమే(Pak Army) బాధ్యత వహించలని డిమాండ్ చేశారు. యుద్ధ సమయంలో దేశ ప్రజలంతా తమకు అండగా నిలిచారని, ఇప్పటికీ మన దేశపూ సైనిక స్థావరాలు సిద్ధంగా ఉన్నాయని, ఎలాంటి ఆపరేషన్ కు అయినా రెడీగా ఉన్నామని ప్రకటించాయి. జరిగిన నష్టాన్ని పాక్ బయటికి చెప్పుకోవడం లేదని తెలిపారు.

Next Story