India-Pakistan war: భారత పౌరులకు ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన విడుదల

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-10 06:45:06  IST  )

భారత్, పాకిస్థాన్ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ (Indian army) కీలక ప్రకటన విడుదల చేసింది.

India-Pakistan war: భారత పౌరులకు ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ (Indian army) కీలక ప్రకటన విడుదల చేసింది. టెరిటోరియల్ ఆర్మీ (ప్రాదేశిక సైన్యం)లో చేరేందుకు భారత పౌరుల నుంచి ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల లోపు వయసు ఉన్న స్త్రీలు, పురుషులు అర్హులుగా పేర్కొంది. అలాగే, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఆదాయం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. మెడికల్‌గా ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలన్న ఇండియన్ ఆర్మీ సూచించింది. దేశానికి సేవ చేయాలని ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు మే 12 నుంచి జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500. జూన్ 20న ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది.

Next Story