- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: ఇండియన్ ఆర్మీ మరో కీలక ప్రకటన
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై ఇండియన్ ఆర్మీ(Indian Army) మరో ప్రకటన చేసింది.

దిశ, వెబ్డెస్క్: ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై ఇండియన్ ఆర్మీ(Indian Army) మరో ప్రకటన చేసింది. ఈ మిషన్లో భాగంగా పాకిస్తాన్కు చెందిన 64 సైనికులు, అధికారులు మృతిచెందినట్లు పేర్కొంది. మరో 90 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. అలాగే పీవోకే(POK), పాకిస్తాన్లోని తొమ్మిది స్థావరాలపై చేసిన మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో దాదాపు 27 మంది భారత టూరిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ దాడిలో భాగంగా మహిళల్ని మినహాయించి.. వారి భర్తల్ని లక్ష్యంగా చేసుకొని అతి క్రూరంగా చంపేశారు. దీంతో భారత మహిళల నుదుటి సిందూరాన్ని తుడిచేసిన టెర్రరిస్టులకు తగిన బుద్ధి చెప్పాలని.. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ అనే మిషన్ స్టార్ట్ చేసింది. మిషన్లో భాగంగా టెర్రరిస్టులకు దీటైన సమాధానం చెప్పింది. ఇక నుంచి ఏ టెర్రర్ ఎటాక్ జరిగినా దానికి యుద్ధంగానే పరిగణిస్తామని ఇప్పటికే ప్రధాని మోడీ స్పష్టం చేశారు.






