- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ విధ్వంసాలకు పాక్ యత్నం.. కట్టడి చేసిన భారత్
పాకిస్థాన్ సైన్యం జరుపుతున్న దాడులకు భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది...

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్(Pakistan) సైన్యం జరుపుతున్న దాడులకు భారత ఆర్మీ(Indian Army) సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. రెండు రోజు నుంచి భారత సరిహద్దు ప్రాంతాలపై జరుపుతున్న డ్రోన్స్, మిస్సైల్, ఫిరంగుల ఎటాక్స్‌ను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తోంది. జమ్మూకాశ్మీర్(Jammu Kashmir), పంజాబ్(Panjab), రాజస్థాన్(Rajastan), గుజరాత్(Gujarat)లోని పౌరులే లక్ష్యంగా దుశ్యర్యకు పాల్పడుతోంది. దీంతో బీఎస్‌ఎఫ్(Bjp) బలగాలు మట్టికరిపిస్తున్నాయి. భారత భూభాగంలోని అడుగు పెట్టగానే ప్రతిదాడి చేసి ధ్వసం చేస్తున్నారు. దీంతో వాటి శకలాలు పౌరుల ఇల్లు, పొలాల్లో పడుతున్నాయి. అలాగే కొన్ని అనుమానాస్పద వస్తువులు, ఫిరంగులు కూడా ఆకాశ మార్గం నుంచి భారత భూభాగంలో పడుతున్నాయి. ఈ మేరకు భారత జవాన్లు వాటిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్ దాడులను సరిహద్దు ప్రాంత ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.






