India-Pakistan war: : సైబర్ దాడులకు దిగనున్న పాక్.. ఇంటెలిజెన్స్ కీలక హెచ్చరికలు

by Muthe.Rajitha |   (  Updated:2025-05-08 19:40:59  IST  )

పహల్గం ఉగ్రదాడి(pahalgam terror attack), పాక్ పై భారత్ ఆపరేషన్ సిందూర్(operartion sindoor) తర్వాత ఇరు దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి.

India-Pakistan war: : సైబర్ దాడులకు దిగనున్న పాక్.. ఇంటెలిజెన్స్ కీలక హెచ్చరికలు
X

దిశ, వెబ్ డెస్క్ : పహాల్గమ్ ఉగ్రదాడి(pahalgam terror attack), పాక్ పై భారత్ ఆపరేషన్ సిందూర్(operartion sindoor) తర్వాత ఇరు దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. గురువారం సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ ఎటాక్ దిగగా.. భారత్ గట్టిగా బదులు ఇచ్చింది. అంతటితో ఆగకుండా పాక్ పై ప్రతిదాడికి దిగింది. పాక్ కీలక నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్ పై వైమానిక దాడులు, మిస్సైల్స్ తో విరుచుకు పడింది. దిక్కు తోచని స్థితిలో పడిన పాక్ నెక్స్ట్ స్టెప్... భారత్ పై సైబర్ ఎటాక్(cyber attack) కు దిగనుంది అని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.

దీంతో భారత ప్రజలకు కీలక సూచనలు చేసింది. తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజెస్, లింక్స్ ఓపెన్ చేయవద్దని తెలిపింది. అలాగే తెలియని నంబర్ల నుంచి అనుమానస్పద కాల్స్ వచ్చినా సమాధానం ఇవ్వకూడదు అని స్పష్టం చేసింది. అందరూ తమ తమ ఫోన్లు, కంప్యూటర్లు అప్డేట్ చేసి, పాస్ వర్డ్స్ మార్చుకోవాలి అని కోరింది. అధికారిక వెబ్సైట్ల నుంచి వచ్చే సమాచారం మాత్రమే నమ్మాలని, ఏదైనా అనుమానం వస్తె వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.

Next Story