- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : భారత్ దెబ్బకు పాకిస్థాన్ కుదేలు.. ప్రతిదాడులతో తిప్పికొడుతున్న ఇండియన్ ఆర్మీ..
Operation Sindoor : భారత్ దెబ్బకు పాకిస్థాన్ కుదేలు.. ప్రతిదాడులతో తిప్పికొడుతున్న ఇండియన్ ఆర్మీ..

* ఆపరేషన్ సిందూర్ .. A to Z పరిణామాలివే..
దిశ, ఫీచర్స్ : పహల్గామ్‌లో పాక్ ఉగ్రదాడి ఘటనకు మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో ప్రతిఘటన దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కూడా మరోసారి దుస్సాహాసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణితో దాడులు చేస్తోంది. గురువారం రాత్రి క్షిపణులు, డ్రోన్లు, యుద్ద విమానాలను భారత్‌పైకి పంపింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లపై దాడులకు తెగబడింది. 35 నిమిషాలపాటు సాగిన పాకిస్తాన్ ప్రయత్నాలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను నేలకూల్చింది. పాక్ పైలట్లను పట్టుకుంది. ఈ పరిణామాలపై జాతీయ భద్రతా సలహాదారు అజీత్ ధోవల్ ప్రధానికి మోడీకి వివరించారు. ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ కంటిన్యూ అవుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడేం జరిగిందో A to Z పరిణామాలను తెలుసుకుందాం.
మే 7, 2025 :
*రాత్రి 1:05 - 1:30 (25 నిమిషాలు): భారత వైమానిక దళం(Indian Air Force) ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని జైష్-ఎ-మొహమ్మద్ (JeM), లష్కర్-ఎ-తోయిబా (LeT)కు సంబంధించిన 9 టెర్రిస్టు స్థావరాలపై రాఫెల్ యుద్ధ విమానాలు, SCALP క్షిపణులు, HAMMER కచ్చితమైన ఆయుధాలతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 80-100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పేర్కొన్న ఆర్మీ అధికారులు. భారతదేశం కేవలం ఉగ్రమూకల స్థావరాలపైనే ఫోకస్ చేసిందని, పాకిస్తాన్ సైనిక స్థావరాలను, పౌరులను లక్ష్యంగా చేయలేదని పేర్కొంది.
*తెల్లవారుజామున 2 : 00 నుంచి: పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్‌లోని ఇండియన్ ఆర్మీ సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఇండియన్ ఆర్మీ, S-400 రక్షణ వ్యవస్థలు ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నాయి.
*ఉదయం 10 గంటలకు : భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారులతో మాట్లాడారు. అలాగే ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి వ్యతిరేక లక్ష్యంలో భాగంగా కొనసాగుతోందని అమెరికా, యూకే, రష్యా వంటి దేశాలకు సమాచారం అందించినట్లు ప్రకటించారు.
*సాయంత్రం 6:00 : భారత్ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ప్రతిదాడులను పాకిస్తాన్ ‘‘యుద్ధ చర్య’’గా పేర్కొంటూ, 26 మంది పౌరులు మరణించారని, 46 మంది గాయపడ్డారని ఆరోపించింది. కాగా భారత్ పాకిస్తాన్ దాడుల వల్ల 15 మంది భారతీయులు మరణించారని, 43 మంది గాయపడ్డారని పేర్కొన్నది.
మే 8, 2025 :
* తెల్లవారుజామున 3:00: పాకిస్తాన్ పంజాబ్‌లోని ఇండియన్ ఆర్మీ స్థావరంపై డ్రోన్ దాడి చేసింది. కానీ దాని ఆటలు కొనసాగలే. ఎందుకంటే భారత రక్షణ వ్యవస్థలు ఆ డోన్ దాడులను తిప్పికొట్టాయి. ఆకాశంలోనే పేల్చేశాయి.
*ఉదయం 9 గంటలు : భారత ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం) ఇతర ప్రతిపక్ష పార్టీలు పాక్ విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలిపాయి.
*మధ్యాహ్నం 12 : 00 : భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 244 జిల్లాలలో రక్షణ సన్నద్ధత కోసం మాక్ డ్రిల్స్ చేపట్టాలని ఇచ్చిన పిలుపును అమలు చేశారు. ఇందులో బ్లాక్ అవుట్‌లు, ఆస్పత్రుల సన్నాహాలు, అనుకోని ప్రమాదాలు, దాడులు జరిగినప్పుడు ఎలా రక్షించుకోవాలో, ఎలా జాగ్రత్త పోలీసులు సహా అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
*సాయంత్రం 5: 00 : సెంట్రల్ హోమ్ మినిష్టర్ అమిత్ షా సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో, హయ్యర్ ఆఫీసర్లతో సమావేశమై భద్రతా చర్యలను సమీక్షించారు.
*రాత్రి 11: 00 : జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఒక ఉగ్రవాద చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్‌ఎఫ్ విఫలం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
మే 9, 2025 :
* సమయం తెల్లవారు జాము 2: 00: అసలే భారత్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్ రాజస్థాన్‌లోని ఒక ఇండియన్ ఆర్మీ స్థావరంపై మిస్సైల్ దాడి చేసింది. కానీ భారత రక్షణ వ్యవస్థలు(Defense systems of India) దీనిని అడ్డుకున్నాయి.
*ఉదయం 6:00: భారత ప్రభుత్వం 21 ఉత్తర (Northern), అలాగే ఉత్తర-పశ్చిమ విమానాశ్రయాలను(North-Western airports) మే 10 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశ వ్యాప్తంగా విమనాల రాకపోకలు స్తంభించాయి.
*ఉదయం 8:00 : పంజాబ్‌లోని గురుదాస్పూర్ జిల్లాలో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు బ్లాక్ అవుట్ చర్యలు కొనసాగాయి. సరిహద్దు రాష్ట్రాల్లో (In border states) విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రజలెవ్వరూ బయటకు రావద్దని పోలీసులు, అధికారులు అనౌన్స్ చేశారు.
*మరింత సమాచారం : జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో భారత సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) ఒక పెద్ద ఇన్‌ఫిల్ట్రేషన్ ప్రయత్నాన్ని నిరోధించింది. భారత నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. రెండు దేశాల మధ్య యువద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యాయి. ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు రద్దయ్యాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)కు కూడా అంతరాయం కలిగింది.
*ఉదయం 10 : 00 : భారత్ పాక్ యుద్ధ పరిణామాలపట్ల అంతర్జాతీయ నేతలు స్పందించారు. (international responses) యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండు దేశాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని కోరగా, యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) పహల్గామ్ ఘటనకు స్పందనగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ప్రతిఘటన దాడులను సమర్థించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఫిలెమాన్ యాంగ్ (Philemon Young) సంయమనం పాటించాలని ఇరు దేశాలను కోరారు.
* ఉదయం 11: 00 : పాకిస్తాన్‌పై దాడికి ప్రతిదాడిగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ యుద్ధ వాతావరణానికి దారితీసింది. దీంతో ఇండియన్ ఆర్మీ మరింత అలర్ట్ అయి బార్డర్ వద్ద పాకిస్తాన్ సైన్యాలను నిలువరించడంలో నిమగ్నమైంది. అటు పాకిస్తాన్ సైన్యాలు కూడా దాడులకు పాల్పడుతుండటంతో ఎటువంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది.
చైనా వస్తువులే కాదు మిస్సైల్స్ కూడా నకిలినే.. సోషల్ మీడియాలో ట్రోల్స్






