India-Pakistan War : మా గురించి బెంగ పెట్టుకోకు, పైలంగా వెళ్లిరా బిడ్డా.. సెలవులో ఉన్న ఆర్మీ జవాన్లకు వీర తిలకం దిద్ది యుద్ధరంగానికి పంపుతున్న తల్లులు

by Javid Pasha |   (  Updated:2025-05-09 10:31:11  IST  )

India-Pakistan War : మా గురించి బెంగ పెట్టుకోకు, పైలంగా వెళ్లిరా బిడ్డా.. సెలవులో ఉన్న ఆర్మీ జవాన్లకు వీర తిలకం దిద్ది యుద్ధరంగానికి పంపుతున్న తల్లులు

India-Pakistan War : మా గురించి బెంగ పెట్టుకోకు, పైలంగా వెళ్లిరా బిడ్డా.. సెలవులో ఉన్న ఆర్మీ జవాన్లకు వీర తిలకం దిద్ది యుద్ధరంగానికి పంపుతున్న తల్లులు
X

దిశ, ఫీచర్స్ : పాకిస్తాన్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది భారతీయ పౌరులను పాక్ టెర్రరిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ప్రతీకార దాడికి దిగింది. ముందు పాకిస్తాన్‌లోని ప్రజలకు హాని జరగకుండా ఉగ్రవాదులపైనే టార్గెట్ చేసిన మన సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులను ప్రయోగించి ఉగ్రవాదులను హతమార్చింది. అయితే ఇంతటితో ఊరుకోకుండా పాకిస్తాన్ మాత్రం దుస్సాహాసానికి పాల్పడింది. ఇండియన్ ఆర్మీ స్థావరాలు, ఎయిర్ పోర్టులపైకి, సామాన్య ప్రజలపైకి డ్రోన్లు, క్షిపణులతో దాడిచేస్తోంది. త్రివిధ దళాలు దీనికి దీటుగా సమాధానం ఇస్తున్నాయి.

ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ బార్డర్‌లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. త్రివిధ దళాల సైనికులు మాత్రం దేశం కోసం, దేశ ప్రజలకోసం యుద్ధ రంగంలో తలమునకలై ఉన్నారు. పరిస్థితులు తీవ్ర రూపంలో దాలుస్తుండటంతో సెలవుల్లో ఉన్న సైనికులందరూ క్యాంప్‌లకు తరలి రావాలని ఇండియన్ ఆర్మీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లీవులో ఉన్న సైనికులు తిరిగి విధుల్లో చేరేందుకు పయనమవుతుండగా.. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఓ వైపు బాధగా ఉన్న దేశంకోసం దుఃఖం దిగమింగుతూ తమ బిడ్డలకు వీర తిలకం దిద్దుతూ, ఆశీర్వదిస్తూ యుద్ధ రంగానికి పంపుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..‘నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘విజయ తిలకాలు దిద్ది శత్రువులను ఏరివేయండిని ఆశీర్వదించి పంపుతున్న తల్లులకు పాదాభివందనాలు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Click For Tweet..

Next Story