India-Pakistan war: విమాన ప్రయాణికులకు కీలక ప్రకటన

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-10 02:48:25  IST  )

భారత్ -పాక్ (India-Pak) సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో పలు విమానాశ్రయాలను (Airports) తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే.

India-Pakistan war: విమాన ప్రయాణికులకు కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ -పాక్ (India-Pak) సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో పలు విమానాశ్రయాలను (Airports) తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport) కీలక ప్రకటన చేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం నుంచి కార్యకలాపాలు పున:ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేశారు.

విమానాశ్రయంలో పరిస్థితులు సాధారణంగా కొనసాగుతున్నాయన్నారు. గగనతలంలో పరిస్థితులు కారణంగా పలు విమానాల షెడ్యూళ్లలో మార్పులు జరిగినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, దేశంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్య భద్రతా తనిఖీలు మరింత కఠనం చేసినట్లు చెప్పారు. దీంతో చెక్-ఇన్‌ ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు ముందుగానే చేరుకోవాలని సూచించారు.

ప్రయాణికులకు జారీ చేసిన సూచనలు:

* తమ విమానాల తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు విమాన సంస్థలను సంప్రదించాలి.

* హ్యాండ్ బాగేజ్, చెక్-ఇన్ లగేజీ నిబంధనలు పాటించాలి.

* భద్రతా తనిఖీలకు ముందుగా సమయం కేటాయిస్తూ విమానాశ్రయానికి ముందుగానే రావాలి.

* విమానాశ్రయం, విమాన సంస్థ సిబ్బందితో సహకరించాలి.

* తమ విమాన స్థితిని అధికారిక వెబ్‌సైట్ లేదా ఎయిర్‌లైన్ అప్లికేషన్‌ ద్వారా తనిఖీ చేయాలి.

* నిర్ధారణ లేని సమాచారాన్ని పంచుకోకుండా, అధికారిక సమాచారం మాత్రమే తెలుసుకోవాలి.

Next Story