- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gaganyaan astronaut: ఉద్రిక్తతల వేళ.. గగన్ యాన్ వ్యోమగానికి వాయుసేన పిలుపు
భారత్- పాక్ ఉద్రిక్తతల వేళ గగన్‌యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్ (Group Captain Ajit Krishnan)ను వాయుసేన వెనక్కి పిలిపించింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్- పాక్ ఉద్రిక్తతల వేళ గగన్‌యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్ (Group Captain Ajit Krishnan)ను వాయుసేన వెనక్కి పిలిపించింది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ (Gaganyaan) కోసం వాయుసేన నుంచి ఎంపికైన వారిలో అజిత్ కూడా ఒకరు. అయితే, ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన.. తనకు ఎయిర్ ఫోర్స్ నుంచి పిలుపు వచ్చిందన్న విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఐఏఎఫ్ నుంచి నాకు పిలుపొచ్చింది’’ అని తెలిపారు. మరోవైపు, ఎయిర్ ఫోర్స్ కు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా.. గగన్‌యాన్ యాత్రకు ఎంపికయ్యారు. అయితే, స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి భారతీయ బృందం వీరిదే. కాగా.. 2027లో ఈ యాత్ర జరగనుంది. ఇందుకోసం అజిత్, అంగద్ ప్రస్తుతం భారత్‌లో శిక్షణ పొందుతుండగా.. శుభాంశు శుక్లా, నాయర్ అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు. అజిత్.. 2003లో ఐఏఎఫ్‌లో చేరారు. వాయుసేనలో ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్నారు. 2900 గంటలకు పైగా పలురకాల యద్ధ విమానాల్ని నడిపిన అనుభవం ఆయన సొంతం. ఇదిలాఉంటే.. మరో వ్యోమగామి మే 29న శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) పయనం కానున్నారు.
ఆపరేషన్ సిందూర్
మంగళవారం అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న వేళ.. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ విరుచుకుపడింది. సరిహద్దులు దాటి 100 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ దాడిలో సాయుధ దళాలు 100 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. ఇంత భారీ స్థాయిలో దాడులు చేసినా తన బాధ్యతను భారత్ మరిచిపోలేదు. ఎక్కడా పాక్ సైనిక స్థావరాలపైగానీ, పౌరుల నివాసాలపైగానీ దాడి చేయలేదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు. ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద మూలాలను పెకిలించడానికే ప్రాధాన్యమిచ్చింది.






