- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాణిజ్య ఆయుధంతో భారత్, పాక్ మధ్య శాంతిని నెలకోల్పాను.. మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) కొద్ది రోజులుగా ప్రపంచ వేదికల్లో చెప్పుకొస్తున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) కొద్ది రోజులుగా ప్రపంచ వేదికల్లో చెప్పుకొస్తున్నాడు. మరోసారి. భారత్-పాకిస్తాన్ శాంతి ఒప్పందం (peace treaty)లో తన పాత్రకు ట్రంప్ క్రెడిట్ తీసుకున్నాడు. ఫాక్స్ న్యూస్‌కు చెందిన బ్రెట్ బేయర్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. తాను వాణిజ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించి భారతదేశం-పాకిస్తాన్ మధ్య శాంతిని సాధించానని, ఈ రెండు అణు శక్తి గల దేశాలు సంఘర్షణ దశలో ఉన్నప్పుడు, అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పారు. అలాగే భారతదేశం, పాకిస్తాన్ మధ్య శత్రుత్వం నిలిపివేత, "నాకు ఎప్పటికీ ఇవ్వని క్రెడిట్ కంటే ఇది చాలా పెద్ద విజయం" అని పిలిచారు. దీనికి ఆయన వివరణ ఇస్తూ, "అవి ప్రధాన అణు శక్తి కలిగిన భారత్- పాకిస్తాన్ దేశాలు వారు కోపంగా ఉన్నారు. తదుపరి దశ బహుశా ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవచ్చు. అది మరింత లోతుగా వెళ్లి.. మరిన్ని క్షిపణులతో కొనసాగే దాడులు జరిగే ప్రమాదం ఉంది. ఇందులో రెండు దేశాలు బలంగా ఉన్నారు. తదుపరి దశ అణు (న్యూక్లియర్) దాడి కావచ్చు" అని ట్రంప్ చెప్పుకొచ్చారు.






