భారత్, పాక్ నిర్ణయానికి నేను చాలా గర్వపడుతున్నాను: ట్రంప్

by Malleboina Mahesh |

కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి అతి కిరాతంగా హత్య చేశారు. ఈ ఉగ్రదాడిపై ఆగ్రహించిన భారత ఆర్మీ.. పీఓకే, పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసి.. 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది.

భారత్, పాక్ నిర్ణయానికి నేను చాలా గర్వపడుతున్నాను: ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్: కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి అతి కిరాతంగా హత్య చేశారు. ఈ ఉగ్రదాడిపై ఆగ్రహించిన భారత ఆర్మీ.. పీఓకే, పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసి.. 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో ఆగ్రహించిన పాక్.. భారత్ పై ప్రత్యక్ష దాడులకు దిగడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ఇరుదేశాల నేతలతో చర్చించి కాల్పుల విరమణకు వచ్చేలా చేశారు. దీంతో భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఉద్రిక్త పరిస్తితులకు చెక్ పడింది. అయితే ఈ కాల్పుల విరమణ (కాల్పుల విరమణ) అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్(Twitter)లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

ట్రంప్ తన ట్వీట్‌లో "ప్రజల మరణానికి, నాశనానికి దారితీసే ప్రస్తుత దురాక్రమణను ఆపాల్సిన సమయం ఆసన్నమైందని పూర్తిగా అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం, ధైర్యాన్ని కలిగి ఉన్నందుకు భారతదేశం, పాకిస్తాన్‌ల బలమైన, అచంచలమైన శక్తివంతమైన నాయకత్వం పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. లక్షలాది మంది మంచి, అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది! మీ ధైర్యవంతమైన చర్యల ద్వారా మీ వారసత్వం బాగా మెరుగుపడింది. ఈ చారిత్రాత్మక, వీరోచిత నిర్ణయం తీసుకోవడంలో USA మీకు సహాయం చేయగలిగినందుకు నేను గర్విస్తున్నాను. చర్చించకపోయినా, ఈ రెండు గొప్ప దేశాలతో నేను వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను. అదనంగా, "వెయ్యి సంవత్సరాల" తర్వాత కాశ్మీర్ విషయంలో ఒక పరిష్కారం లభిస్తుందో లేదో చూడటానికి నేను మీ ఇద్దరితో కలిసి పని చేస్తాను. ఈ పనికి భారతదేశం, పాకిస్తాన్ నాయకత్వాన్ని దేవుడు దీవించుగాక! అంటూ ట్రంప్ రాసుకొచ్చారు. దీంతో కశ్మీర్ వివాదానికి తెరపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Next Story