- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Renu Desai: చేతులెత్తి దండం పెడుతున్నా.. ఈ సమయంలో అలాంటి పోస్టులు పెట్టకండి అంటూ రేణు దేశాయ్ పోస్ట్
గత నెల జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఏకంగా 26 మంది అమాయకపు ప్రజలు మరణించిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గత నెల జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఏకంగా 26 మంది అమాయకపు ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో యావత్ భారతీయులు ఆగ్రహానికి గురయ్యారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ ఉగ్రమూకలపై విరుచుకుపడింది. పాకిస్తాన్‌తో పాటు తొమ్మిది కీలక స్థావరాలను నేలమట్టం చేసి పాక్‌ను తుక్కు తక్కుగా ఓడించి అక్కడి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం అయ్యేలా చేసింది. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు సాగుతున్నాయి.
రోజు రోజుకు పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి తప్ప సద్దుమణగడం లేదు. ఈనేపథ్యంలో.. నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు భారత సైనికులకు అండగా నిలబడుతున్నారు. వారికి విరాళం అందిస్తూనే తమ అభిప్రాయాలను తెలుపుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వార్‌కు సంబంధించిన పోస్టులు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. కొంతమంది వార్‌పై పలు ఫన్నీ రీల్స్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తున్నారు.
తాజాగా, ఈ విషయంపై స్పందించిన రేణు దేశాయ్(Renu Desai) ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ గ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు తీవ్రతరం అవుతున్నాయి. ఈక్రమంలో కొంతమంది వ్యూస్ కోసం ఫన్నీ రీల్స్, వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబర్‌లందరికీ ఈ పోస్ట్ పెడుతున్నాను. మనం భయం లేకుండా నిద్రపోతున్నామంటే దానికి కారణం మన సైనికులు. కాబట్టి వారి కుటుంబాలు, సరిహద్దుల సమీపంలో నివసించే సైనికులు.. దేశంలోని అమాయక పౌరుల వారి బాధను దయచేసి అర్థం చేసుకోండి. మన ప్రార్థనలు వారికి అండగా ఉంటాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో మనం ఐక్యంగా ఉండవలసిన సమయం ఇది. ఎక్కువ మంది అనుచరులు, వీక్షణలను పొందడంలో సంతృప్తి చెందాలని అలాంటి వీడియోలు చేస్తున్నారు’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా చేతులెత్తి దండం పెట్టే ఎమోజీని షేర్ చేసింది.






