- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PTI : పాక్ కు వ్యతిరేకంగా లాహోర్ లో భారీ ర్యాలీ
అసలే భారత దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్థాన్ కు కొత్త తల నొప్పులు ఎదురవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : అసలే భారత దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్థాన్ కు కొత్త తల నొప్పులు ఎదురవుతున్నాయి. పాక్ ప్రభుత్వంపై సొంత దేశంలోనే తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. భారత్-పాక్(India Pakistan War) మధ్య భీకర యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. భారత్ సరిహద్దు రాష్ట్రాలపై పాక్ రాకెట్, డ్రోన్లతో దాడికి దిగింది. వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటూనే.. పాక్ పై ఎదురు దాడికి దిగింది భారత్. ఇస్లామాబాద్,లాహోర్ నగరాలపై వైమానిక, మిసైల్స్ దాడులు చేసింది. కరాచీ ఎయిర్పోర్టుపై విరుచుకుపడి పూర్తిగా ధ్వంసం చేసింది.
అయితే ఇదే అదనుగా భావించిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Pak Former PM Imran Khan) అనుచరులు లాహోర్ లలో భారీ నిరసనలకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని PTI పార్టీ కార్యకర్తలు, ఇమ్రాన్ అనుచరులు ర్యాలీ నిర్వహించారు. యుద్ధం ఆపేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తూ రోడ్లపై భారీగా ర్యాలీకి దిగగా.. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు భారత్, మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ వరుస దాడులు చేస్తూ పాక్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా.. ఇపుడు దేశ ప్రజల నుంచి కూడా తీవ్ర నిరసనలు ఎదురవడం మింగుడు పడకుండా ఉంది.






