- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ ఎన్ని విమానాలు కోల్పోయింది.. రాహుల్ గాంధీ సంచలన డిమాండ్
ఆపరేషన్ సిందూర్ వివరాల బహిర్గతంపై రాహుల్ గాంధీ మరోసారి విదేశాంగ మంత్రిపై విమర్శలు చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ జై శంకర్ మౌనం పై ప్రశ్నలు వేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ వివరాల బహిర్గతంపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విదేశాంగ మంత్రిపై విమర్శలు (Criticism of the Foreign Minister) చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ జై శంకర్ మౌనం పై ప్రశ్నలు వేశారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను (Minister S. Jaishankar) లక్ష్యంగా చేసుకొని మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి "మన దాడి ప్రారంభంలోనే పాకిస్తాన్‌కు సమాచారం ఇవ్వడం నేరం" అని జైశంకర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు."విదేశాంగ మంత్రి జైశంకర్ నిశ్శబ్దం కేవలం సమాచారాన్ని వెల్లడించడం కాదు. అది విపత్కరం," అని తాజా ట్వీట్‌లో రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. అలాగే భారత వైమానిక దళం (IAF) ఈ ఆపరేషన్‌లో ఎన్ని విమానాలు కోల్పోయిందనే గత ప్రశ్నను గుర్తు చేస్తూ.. "మరోసారి అడుగుతున్నాను" పాకిస్తాన్‌కు ముందే సమాచారం తెలిసినందున మనం ఎన్ని విమానాలు (aircraft) కోల్పోయాము?" అని జైశంకర్‌ని ప్రశ్నించారు. ఈ ట్వీట్ రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం చేసిన పోస్ట్‌కు కొనసాగింపుగా వచ్చింది.
ఆపరేషన్ సిందూర్ వివరాలను ప్రారంభానికి ముందే బహిర్గతం చేశారని జైశంకర్ (జైశంకర్)పై తీవ్రంగా ఆరోపిస్తూ.. ఈ నెల 17 రాహుల్ ట్వీట్ చేశారు. అందులో "ఇది ఒక తప్పు కాదు, ఇది నేరం. దేశం సత్యాన్ని తెలుసుకోవాలి," అని అన్నారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడుల గురించి ముందస్తు హెచ్చరిక ఇచ్చిందని రాహుల్ గాంధీ వాదించారు. భారత విదేశాంగ మంత్రి "మన దాడి ప్రారంభంలోనే పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చినట్లు పబ్లిక్‌గా అంగీకరించారు" అని గాంధీ పేర్కొన్నారు. ఈ చర్యకు ఎవరు అధికారం ఇచ్చారు. దీని ఫలితంగా ఎన్ని విమానాలు కోల్పోయామనే ప్రశ్నలను కూడా ఆయన లేవనెత్తారు. కాగా రాహుల్ గాంధీ ఆరోపణలను విదేశాంగ శాఖ "వాస్తవాల తప్పుడు చిత్రణ" అని కొట్టి పడెసింది.






