Pakistan: పాకిస్తాన్ లో ఉన్న శక్తి పీఠం ఇదే.. నేటికి వేలాది మంది హిందువులు దర్శించుకుంటారు..ఎక్కడంటే..?

by Vennela |

Pakistan: పాకిస్తాన్లో అనేక హిందూ దేవాలయాలు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని ప్రముఖమైనవి యావత్ ప్రపంచంలోనే హిందువులకు అత్యంత ఆరాధనీయ దర్శనీయ ప్రదేశాలుగా ఉన్నాయి.

Pakistan: పాకిస్తాన్ లో ఉన్న శక్తి పీఠం ఇదే.. నేటికి వేలాది మంది హిందువులు దర్శించుకుంటారు..ఎక్కడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: Pakistan: పాకిస్తాన్లో అనేక హిందూ దేవాలయాలు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని ప్రముఖమైనవి యావత్ ప్రపంచంలోనే హిందువులకు అత్యంత ఆరాధనీయ దర్శనీయ ప్రదేశాలుగా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లో రెండు శక్తి పీఠాలు ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి. వీటిలో ఒకటి పాక ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని నీలంలోయలోని శారదాపీఠం కాగా, రెండోది పాకిస్థాన్లోని బెలూచిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ దేవి దేవాలయం. సతీదేవి శరీర భాగాలు పడిన శక్తి పీఠాల్లో హింగ్లాజ్ ఒకటి. ఇక్కడ సతీదేవి శిరస్సు భాగంలోని బ్రహ్మ రంధ్రం పడిందనే పేరుంది.

హింగ్లాజ్ మాత దేవాలయం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని లారీ తహసిల్‌లోని మారుమూల పర్వత ప్రాంతంలో ఒక లోయలో ఉంది. ఇది కరాచీకి 250 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది హింగోల్ నది పశ్చిమ ఒడ్డున, మక్రాన్ ఎడారిలోని ఖేర్థార్ కొండల శ్రేణి చివరలో నిర్మించారు. ఈ ప్రాంతం హింగోల్ నేషనల్ పార్క్ పరిధిలోకి వస్తుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులు పాకిస్తాన్ వీసా తీసుకొని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా రాజ్ పూత్ క్షత్రియులు హింగ్లాజ్ అమ్మవారిని తమ కులదేవతగా కొలుస్తారు.

హింగ్లాజ్ అమ్మవారిని స్థానిక ముస్లింలు సైతం బీబీ నాని అని గౌరవిస్తారు. ఇక్కడ అమ్మవారి స్వరూపం ఒక శిల రూపంలో ఉంటుంది ఈ శిల మొత్తం సింధూరంలో కప్పబడి ఉంటుంది. ఇక్కడ దేవాలయం రూపంలో ప్రత్యేకంగా నిర్మాణం ఉండదు కేవలం ఒక గుహలోపల మాత్రమే ఇది ఉంటుంది. చుట్టూ ఎడారి ఉండటంతో పాటు నిర్మానుష్య ప్రదేశంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. దేశ విభజన జరిగినప్పటికీ, నేటికి హిందువులు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ దర్శించుకునేందుకు రిస్క్ తీసుకొని మరీ వస్తుంటారు.:

Next Story