- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : స్వర్ణ దేవాలయం ఆయుధాలు.. ఆ వార్తల్లో నిజం కాదన్న ఇండియన్ ఆర్మీ
భారత సైన్యం(Indian Army) అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం(Amrutsir Golden Temple) పరిసరాల్లో ఆయుధాలను మోహరించినట్టు(Guns Deployed) మంగళవారం వార్తలు ప్రసారం అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : భారత సైన్యం(Indian Army) అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం(Amrutsir Golden Temple) పరిసరాల్లో ఆయుధాలను మోహరించినట్టు(Guns Deployed) మంగళవారం వార్తలు ప్రసారం అయ్యాయి. అయితే ఆ వార్తలు అవాస్తవం అని ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన జారీ చేసింది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో పాకిస్తాన్ స్వర్ణ దేవాలయంపై దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానంతో ఇండియన్ ఆర్మీ దేవాలయంలో ఎయిర్ డిఫెన్స్ గన్స్, ఇతర రక్షణ ఆయుధాలను మోహరించినట్లు వచ్చిన వార్తలపై క్లారిటీ ఇస్తూ.. శ్రీ దర్బార్ సాహిబ్ అమృత్సర్(స్వర్ణ దేవాలయం) పరిసరాల్లో ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ గన్స్ ను మోహరించలేదని తెలిపింది.
అయితే సోమవారం ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్హా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ స్వర్ణ దేవాలయంపై డ్రోన్స్ దాడికి ప్రయత్నిస్తే.. వారిని అడ్డుకోవడానికి దేవాలయ కమిటీ ఆలయంలో లైట్లు ఆర్పివేసి, భారీగా ఆయుధాలు మోహరించడానికి అనుమతి ఇచ్చిందని తెలపడంతో ఈ గందరగోళం నెలకొంది. దీనిపై అటు ఇండియన్ ఆర్మీ, ఇటు శ్రోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) క్లారిటీ ఇచ్చారు. కేవలం లైట్లు ఆర్పడానికి మాత్రమే అనుమతి ఇచ్చామని, ఆయుధాల మోహరింపు నిజం కాదని స్పష్టం చేశాయి.






