- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ మిస్సైల్స్‌ను బూడిద చేసిన ''సుదర్శన చక్ర''..దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఇండియా పాకిస్థాన్ (India Pakistan) మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. యుద్దం ప్రకటించకపోయినా రెండు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులకు పాల్పడుతున్నాయి.

దిశ,వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ (India Pakistan) మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. యుద్దం ప్రకటించకపోయినా రెండు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ భారత్ లోని 15 నగరాల్లోని ఆర్మీ స్థావరాలపై పై మిస్సైల్ దాడి చేసింది. కాగా ఆ మిస్సైల్ దాడిని భారత ఆర్మీ సమర్ధవంతంగా అడ్డుకుని మిస్సైల్‌ను నాశనం చేసింది. దీనికోసం భారత ఆర్మీ S-400 సుదర్శన చక్ర (Sudharshan chakra)ను ఉపయోగించింది.
ఇది ఒక అత్యాధునిక క్షిపని వ్యవస్థ.. ఒకేసారి సుదర్శన చక్ర 15 నగరాలపై జరిగిన మిస్సైల్ దాడులను అడ్డుకోగలిగింది అంటే ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో అర్థం చేసుకవచ్చు. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సుదర్శన చక్ర అనేక లేయర్స్ కలిగిన రక్షణ వ్యవస్థ. ఏక కాలంలో 400 కిలోమీటర్ల నుండి డ్రోన్, ఫైటర్ జెట్లు మరియు బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ఏక కాలం దాదాపు 80 లక్ష్యాలను ఇది ట్రాక్ చేసి నాశనం చేస్తుంది.
ఒకేసారి 36 లక్ష్యాలను సుదర్శన చక్ర సాధిస్తుంది. దీనిని రష్యా(Russia)కు చెందిన అల్మాస్ యాంటే కంపెనీ తయారు చేసింది. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది సులభంగా గుర్తించి దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2018వ సంవత్సరంలో భారత్ దీనిని రష్యాతో 5.43 బిలియన్ల ఒప్పందంపై సంతకం చేసుకుని కొనుగోలు చేసింది. కాగా మొదటిసారి పాకిస్థాన్‌తో ఉధ్రిక్తతల నేపథ్యంలో దీనిని ఉపయోగించి పాక్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసింది. ఈ దెబ్బతో ఇండియన్ ఆర్మీ పవర్ పాకిస్థాన్ కే కాకుండా మన శత్రుదేశాలు అన్నింటికీ తెలిసింది. ఇక దీని పేరు S-400 ట్రయాంఫ్ కాగా భారత్‌లో దీనిని విష్ణుమూర్తి చేతిలో ఉండే విష్ణు చక్రం పేరుతో సుదర్శన చక్ర అని పిలుస్తున్నారు.






