మూల్యం చెల్లించుకోక తప్పదు: పాకిస్థాన్‌కు మాజీ ఉపరాష్ట్రపతి స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

ఉగ్రవాదాన్ని ఆపకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని పాకిస్థాన్‌కు మాజీ ఉపరాష్ట్రపతి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు..

మూల్యం చెల్లించుకోక తప్పదు: పాకిస్థాన్‌కు మాజీ ఉపరాష్ట్రపతి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని పాకిస్థాన్‌(Pakistan)కు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Former Vice President ) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్‌(Operation Sindhur)తో బుద్ధి చెప్పామని ఆయన గుర్తు చేశారు. పహల్గాం ఉగ్రచర్య(Pahalgam Terror Attack) అత్యంత అనాగరికమని, హేయమని ఖండించారు. మతం పేరుతో పాకిస్థిన్ విషబీజాలు నాటుతోందని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కార్యాచరణ రెడీ చేయాలని, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేయాలన్నారు. ప్రపంచ సమస్యగా ఉగ్రవాదం మారిందని, మానవాళికి అతి పెద్ద శత్రువు అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

Next Story