- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fake Accounts : సోఫియా, వ్యోమికా సింగ్ పేర్లతో ఫేక్ అకౌంట్స్
పహాల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)అనంతరం పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పేరులో వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పహాల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)అనంతరం పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పేరులో వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన ఆర్మీ కర్నల్ సోఫియాకురేషి(Sofia Khureshi) , నేవీ వింగ్ కమాండర్, హెలికాప్టర్ పైలెట్ వ్యోమికా సింగ్(Vyomica Singh)పేర్లు దేశం మొత్తం మారు మోగిపోయాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత వీరిద్దరూ భారత్ లో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. దేశ ప్రజలు వీరికి బ్రహ్మరథం పట్టారు.
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఎప్పటికప్పుడు యుద్ధానికి సంబంధించిన వివరాలను ప్రెస్ మీట్ లు పెట్టి వీరిద్దరూ మీడియాకు వివరిస్తున్నారు. కాగా వీరిద్దరి పేరు మీద సోషల్ మీడియా ఖాతాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ అయినట్టు పిబిఐ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది వీరిద్దరికి ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవని, వాటిని నమ్మవద్దని, నకిలీ ఖాతాల పట్ల అలర్ట్ గా ఉండాలని సూచిస్తూ పి.బి.ఐ ఫ్యాక్ట్ చెక్ ఒక ప్రకటనలో పేర్కొంది.






