పాకిస్తాన్ లో భారీ భూకంపం !

by velandi.Saikiran |   (  Updated:2025-05-10 07:25:20  IST  )

Earthquake with magnitude of 4.0 hits Pakistan, tremors felt across country

పాకిస్తాన్ లో భారీ భూకంపం !
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ ( Pakisthan) దేశానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇండియా (India) చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్.. అటు BLA ( Balochistan Liberation Army) చేతిలో కూడా... నరకం అనుభవిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ దేశానికి మరో ఊహించని షాక్ తగిలింది. కాసేపటి క్రితమే పాకిస్తాన్ దేశంలో భూకంపం ( Pakisthan earthquake) వచ్చింది.

జనాలంతా యుద్ధం భయంతో చస్తూ బతుకుతూ ఉంటే... తాజాగా భూకంపం రావడం కలకలం సృష్టించింది. రిక్టర్ స్కేల్ పైన 4.0 గా భూకంపం నమోదు అయింది. అయితే ఈ భూకంపం రావడంతో జనాలంతా ఇండ్లలో నుంచి బయటకు వచ్చి పరుగులు పెట్టారు. పాకిస్తాన్ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ భూకంపం వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Click For Tweet..

Next Story