- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూలో మళ్లీ డ్రోన్స్ ఫేకు రాయుళ్ల పని..తేల్చేసిన ఫ్యాక్ట్ చెక్
ఇండియా పాక్ మధ్య నెలకొన్న వివాదంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ నిన్న రాత్రి మళ్లీ కాల్పులకు తెగబడింది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాక్ మధ్య నెలకొన్న వివాదంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ నిన్న రాత్రి మళ్లీ కాల్పులకు తెగబడింది. పాక్ డ్రోన్లు సరిహద్దుల్లో కలకలం రేపాయి. దీనిపై భారత్ సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించడంతో పాక్ తోక ముడిచింది. కానీ జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ నేడు డ్రోన్స్ ఎగిరాయని, ఉద్దమ్ పూర్‌లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయని ట్విట్టర్ లో కొందరు పోస్టులు పెట్టారు. దీంతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.
అయితే ఆ వార్తలు ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ తేల్చింది. ఆ వార్తలు అవాస్తవం అని ప్రజలను భయపెట్టడానికి ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారని పేర్కొంది. కేవలం ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్దంపై చాలా మంది సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. కాల్పుఇండియా పాక్ మధ్య నెలకొన్న వివాదంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ నిన్న రాత్రి మళ్లీ కాల్పులకు తెగబడింది.లు జరగకపోయినా జరిగాయని, డ్రోన్స్ ఎగరకపోయినా ఎగిరాయని చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం నుండి ప్రకటన వస్తేనే ఏదైనా విషయాన్ని నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు.






