స్టార్ హీరోలూ.. మా రియల్ హీరో మురళీ నాయక్‌ను చూసి నేర్చుకోండి..సెలబ్రిటీల దేశభక్తిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-17 06:56:10  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ గురించి సెలబ్రిటీలు స్పందించకపోవడంపై కామెంట్స్ చేశారు. స్టార్ హీరోలు ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ స్పందించట్లేదని చాలా మంది అంటున్నారని..

స్టార్ హీరోలూ.. మా రియల్ హీరో మురళీ నాయక్‌ను చూసి నేర్చుకోండి..సెలబ్రిటీల దేశభక్తిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఫీచర్స్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ గురించి సెలబ్రిటీలు స్పందించకపోవడంపై కామెంట్స్ చేశారు. స్టార్ హీరోలు ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ స్పందించట్లేదని చాలా మంది అంటున్నారని.. ‘కానీ వాళ్లు దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. జస్ట్ ఎంటర్‌టైనర్స్ మాత్రమే.. గుడ్ పర్ఫార్మర్స్ కూడా.. అంతకు మించి వారి నుంచి దేశభక్తిని ఆశించొద్దు.. దేశభక్తి అంటే ఒక మురళీ నాయక్‌ లాంటి వాడు.. ఒక 23ఏళ్ల కుర్రాడు పోతే సైనికుడిగా పోవాలి.. పోతే దేశం కోసం పోవాలి అని సంకల్పించాడు. ఆయనకు ఏం ఇవ్వగలం.. ఆయన తల్లిదండ్రులకు ఏం చెప్పగలం.. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని కోరుకున్నాడు.

‘ఏం గుండెరా అది’, ‘ గట్స్ ఉండాలి ఇలా మాట్లాడాలంటే’, ‘ఎందుకు బాలీవుడ్ స్టార్స్ స్పందించాలని కోరుకుంటున్నారు అంతకన్నా గొప్ప స్టార్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నరు’, ‘స్టార్ హీరోలూ.. మా మురళీ నాయక్‌ను చూసి నేర్చుకోండి’ అని కొందరు అంటుంటే.. ‘ఇదే విషయాన్ని ట్వీట్ చేయగలడా అందరు హీరోలను ట్యాగ్ చేస్తూ’,‘ఏపీలో రేప్స్, మర్డర్స్ జరుగుతుంటే ఈయన ఏం మాట్లాడట్లేదు ఎందుకు మరి ?’ అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.

Next Story