- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ రాత్రి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తే.. పాక్‌కు చుక్కలే
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) మొదలుపెట్టాక తొలిసారి త్రివిధ దళాలు ఒకేసారి మీడియా ముందుకు వచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) మొదలుపెట్టాక తొలిసారి త్రివిధ దళాలు ఒకేసారి మీడియా ముందుకు వచ్చాయి. ఆపరేషన్ సిందూర్‌పై కీలక అప్డేట్ ఇచ్చాయి. అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదని డీజీఎంవో రాజీవ్ ఘాయ్ పేర్కొన్నారు. ఉగ్రదాడుల్లో ఐదుగురు జవాన్లు, ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం తెలిపారు. కాల్పుల విరమణ అవగాహన తర్వాత కొన్ని గంటలకే పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందని అన్నారు. ఎల్వోసీ దగ్గర 35-40 మంది పాక్ సైనికులు చనిపోయారని తెలిపారు. మరోసారి పాక్ దుశ్చర్యకు దిగితే ప్రతిస్పందన కఠినంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే సహించేది లేదని అన్నారు. ఈ రాత్రికి కాల్పుల విరమణ అవగాహన ఉల్లంఘిస్తే.. తీవ్రంగా స్పందించాలని మిలటరీకి ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్‌తో తమ లక్ష్యాలన్నింటినీ అందుకున్నాం.. పైలట్స్ అందరూ తిరిగివచ్చారు.. భారత్ పైలట్‌ను పట్టుకున్నామన్న పాక్ ప్రచారం నిజంకాదని కొట్టినపారేశారు. పాక్‌ను నమ్మలేం.. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే ఏమవుతుందో వాళ్లకు తెలుసని అన్నారు. ఉగ్ర శిబిరాలపై దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మరణించారని డీజీఎంఓ(DGMO) వెల్లడించారు. ఉగ్ర శిబిరాలపై దాడులతో పాకిస్తాన్ చలించిపోయిందని అన్న ఆయన.. ఈ దాడుల తర్వాత పాక్.. భారత పౌరులపై దాడులు చేసిందని మండిపడ్డారు. పౌరులపై దాడులకు పాకిస్తాన్ తగిన ప్రతిఫలం చెల్లించిందని అన్నారు. భారత్‌కు ఉగ్రవాదం అంతం చేయడం తప్ప ఇంకో మార్గం లేదని స్పష్టం చేశారు.






