DGMO Meeting : ముగిసిన భారత్-పాక్ చర్చలు

by Muthe.Rajitha |   (  Updated:2025-05-12 13:53:04  IST  )

భారత్-పాక్(Bharat-Pak)ల మధ్య డీజీఎంవో(DGMO)ల చర్చలు ముగిశాయి.

DGMO Meeting : ముగిసిన భారత్-పాక్ చర్చలు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్-పాక్(Bharat-Pak)ల మధ్య డీజీఎంవో(DGMO)ల చర్చలు ముగిశాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు జరిపిన ఈ చర్చలు కొద్దిసేపటి క్రితమే ముగిసినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. హాట్ లైన్ ద్వారా జరిగిన ఈ చర్చల్లో.. భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాక్ తరపున మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. అయితే ఈ చర్చలు ఈరోజు మధ్యాహ్నమే జరగాల్సి ఉండగా.. సాయంత్రానికి వాయిదా పడ్డాయి. ఈ చర్చల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల తగ్గింపు, POK అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.

కాగా జమ్ము కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడిPahalgam (Terror Attack) అనంతరం.. POK పై భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor), సరిహద్దులో పాక్ కాల్పులు వంటి చర్యలతో ఇరు దేశాలు యుద్ధానికి దిగి.. మే 10న కాల్పుల విరమణ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు డీజీఎంవో అధికారులు ఈ చర్చలు జరిపారు.

Next Story